తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత పథకం ద్వారా 35 మంది పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు (Scholarships) అందించారు.
తానా (Telugu Association of North America) ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి నిర్వహణలో సెప్టెంబర్ 7 గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియా ట్రిప్ లో ఉన్న రామ్ చౌదరి ఉప్పుటూరి, భారత రాష్ట్ర సమితి (BRS) యూత్ లీడర్ రాహుల్ రావు, నల్గొండ జిల్లా చిన్నకాపర్తి ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేయూత పథకంలో భాగంగా పేద విద్యార్థులకు TANA ఉపకారవేతనాలు (Scholarships) అందించామన్నారు. ఇలాగే మున్ముందు కూడా అవసరమైన వారికి చేయూత అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli), తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మరియు తానా బోర్డు ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, సమన్వయకర్త శ్రీకాంత్ పోలవరపు లను విద్యార్థుల తల్లితండ్రులు అభినందించారు.