Connect with us

Education

చిరు మోములపై సంతోషాన్ని తొణికిసలాడించిన TANA Foundation స్కాలర్షిప్స్ @ Hyderabad, Telangana

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘చేయూత’ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో ఏళ్లుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అనాధలు మరియు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద పిల్లలకు ఈ TANA Foundation ఉపకార వేతనాలు తోడుగా నిలుస్తున్నాయి.

తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) నిర్వహణలో, దాత గౌతమ్ అమర్నేని & ఫ్యామిలీ (Gautham Amarneni & Family) దాతృత్వంతో మరో 50 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి గొప్ప మనసును చాటుకున్నారు. ఆగస్ట్ 2, శుక్రవారం రోజున హైదరాబాద్ పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ అందుకున్నారు.

భాగ్యనగరం (Hyderabad, Telangana) లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దాతలు గౌతమ్ అమర్నేని మరియు తన కుమారుడు రాహుల్ అమర్నేని ప్రత్యక్షంగా పాల్గొని 50 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. దీంతో ఆ చిరు మోములపై సంతోషం తొణికిసలాడింది. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఎప్పటిలానే శశికాంత్ వల్లేపల్లి సమన్వయపరిచారు.

ఎంపవరింగ్ జనరేషన్స్ (Empowering Generations) అంటూ ఇప్పటి వరకు ఎన్నో వందల మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాల (Scholarships) పరంపరతో తానా ఫౌండేషన్ (TANA Foundation) రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా ఈ ‘చేయూత’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ తానా అమ్ములపొదిలో ఒక కలికితురాయిగా నిలుస్తుంది.

ఈ సందర్భంగా స్కాలర్షిప్స్ (Scholarships) అందుకున్న చిన్నారులు తానా (Telugu Association of North America) అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, ‘చేయూత’ ప్రాజెక్ట్ సమన్వయకర్త శ్రీకాంత్ పోలవరపు మరియు పడాల ఛారిటబుల్ ట్రస్ట్ (Padala Charitable Trust) డైరెక్టర్ రవీంద్ర తంగిరాల తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected