Connect with us

News

శశికాంత్‌ వల్లేపల్లి సారధ్యంలో TANA Foundation లీడర్షిప్ ఎన్నిక

Published

on

ఫిబ్రవరి 29న జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) బోర్డ్‌ సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చుతూ కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులు, ఫౌండేషన్ (Foundation) సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల నియామకాలకు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డ్‌, పాలకవర్గం, ఫౌండేషన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

దీంతో నిన్న మార్చి 2 శనివారం రోజున తానా ఫౌండేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో (TANA) ఫౌండేషన్ కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్‌ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్‌ మద్దినేని, జాయింట్‌ ట్రెజరర్‌గా కిరణ్‌ గోగినేని ఎన్నికయ్యారు. వీరిలో మొదటి ముగ్గురికి తానా బోర్డు లో వోట్ ఉంటుంది.

ది మోస్ట్ ఎలిజిబుల్ తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి

2017 నుంచి తానా ఫౌండేషన్ ట్రస్టీ గా, 2021 నుంచి ఫౌండేషన్ సెక్రటరీ గా చేయూత స్కాలర్షిప్స్, హెల్దీ హెల్దీ గళ్ హెల్దీ ఫ్యూచర్, ఆయుష్ చైల్డ్ హార్ట్ సర్జరీ వంటి వినూత్న సేవాకార్యక్రమాలతో దూసుకెళుతున్న శశికాంత్ (Sasikanth Vallepalli) మచ్చలేని వ్యక్తి. అంతకు ముందు 2007 నుండి తానా టీం స్క్వేర్, డిజిటల్ పాఠశాలలు, గ్రంథాలయాలు, కాన్ఫరెన్స్ వంటి పలు కార్యక్రమాలకు గుప్త దానాలు చేస్తూ ఇప్పుడు ది మోస్ట్ ఎలిజిబుల్ తానా ఫౌండేషన్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అంకితమైన సేవాభావం, అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న శశికాంత్‌ వల్లేపల్లి మొదటి నుంచి కూడా మంచి దాతగా పేరు తెచ్చుకున్నారు.

తానా క్యాన్సర్ క్యాంపుల బాహుబలి విద్యాధర్ గారపాటి

దాతృత్వం మరియు సేవే పరమార్ధంగా ఇప్పటి వరకు సుమారు $750,000 సొంత నిధులు వివిధ సేవాకార్యక్రమాల కోసం దానం చేసి ఔదార్యాన్ని చాటిన విద్యాధర్ గారపాటి (Vidyadhar Garapati) ఎన్నిక పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తానాలో అధ్యక్షులు, ఫౌండేషన్ ఛైర్మన్లు, బోర్డు ఛైర్మన్లు ఇలా ఏ పెద్ద పదవుల్లో ఎవరు ఉన్నా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాటికి కూడా తానా క్యాన్సర్ క్యాంపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు విద్యాధర్ గారపాటి. తానా పబ్లిసిటీ కమిటీకి ఛైర్మన్‌గా, న్యూ జెర్సీ ప్రాంతీయ కార్యదర్శిగా, తానా ఫౌండేషన్ సభ్యులుగా పలు దఫాలుగా సేవలందించారు.

వివాదరహితులు వినయ విధేయ రామ వినయ్ మద్దినేని

తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ గా, ఫౌండేషన్ సభ్యుని గా పూర్తి వివాదరహితులు వినయ విధేయ రాముడు వినయ్ మద్దినేని (Vinay Maddineni) సేవలందిస్తున్నారు. ఎక్కువగా తానా బ్యాక్ ఎండ్ లో పని చేస్తూ పేరు ఆశించని తత్త్వం వినయ్ మద్దినేని ది. ఈ విషయం ముఖ్యంగా అట్లాంటా వాసులకు బాగా తెలుసు. మెట్రో అట్లాంటా ప్రాంతంలో చాలా చురుకైన కమ్యూనిటీ సర్వీస్ నాయకుడు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా (TAMA) అధ్యక్షునిగా, బోర్డు ఛైర్మన్ గా సేవలందించారు.

అందరితో ఇట్టే కలిసిపోయే సౌమ్యులు కిరణ్ గోగినేని

తానాలో సౌత్ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ గా, ఫౌండేషన్ సభ్యుని గా కిరణ్ గోగినేని (Kiran Gogineni) పలుసేవలందించారు. సౌమ్యునిగా, అందరితో ఇట్టే కలిసిపోయే టీం ప్లేయర్ గా మంచి వ్యక్తిత్వం ఆయన సొంతం. అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’, ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా (IFA) తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తానా ఫౌండేషన్‌ సభ్యునిగా ఉన్న ప్రస్తుతం ఫౌండేషన్‌ జాయింట్‌ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.

error: NRI2NRI.COM copyright content is protected