ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు వరదలకు అతలాకుతలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ (TANA Foundation) ఎప్పటిలానే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది. తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో విడతలవారీగా వరద బాధితులకు బాసటగా నిలిచారు.
ఎలప్రోలు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా (NTR District) లోని ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలప్రోలు గ్రామంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు, చీరలు, టవళ్ళు పంపిణీ వంటి ఇతరత్రా ఇతర సహాయాన్ని అందించారు. దాదాపు 1645 బాక్స్‌లలో నిత్యావసర వస్తువులను ప్యాక్ చేసి అందరికీ అందజేశారు.
మరోవిడతలో ఇంకొంతమందికి కూడా సహాయం అందించనున్నట్లు తానా ఫౌండేషన్ (TANA Foundation) ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ (Telangana) లోని వరద బాధితులను కూడా ఆదుకుంటుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజశేఖర్, హరేకృష్ణ మిషన్ (Hare Krishna Mission) ప్రతినిధి మహాక్రతు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ విజయవాడ లోని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) బిజెపి స్టేట్ మీడియా ఇన్ చార్జ్ పాతూరి నాగభూషణం (Paturi Nagabhushanam) చేతులమీదుగా ఈ సహాయం అందించారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (TANA Foundation Chairman Sasikanth Vallepalli) ఆధ్వర్యంలో సహాయక చర్యలకు స్పీడు పెంచారు. ఎక్కడికక్కడ ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతూ వీలైనంతవరకూ సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీధర్, సుబ్బయ్య మరియు ఇతర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
బొబ్బర్లంక గ్రామం, మోపిదేవి మండలం, అవనిగడ్డ
గత శుక్రవారం అవనిగడ్డ లోని మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో 200 వరద బాధిత కుటుంబాల వారికి తానా ఫౌండేషన్ (TANA Foundation) ఆధ్వర్యంలో పది రకాల నిత్యావసర సరుకులు, టవల్స్ సహాయంగా పంపిణీ చేశారు. గ్రామంలోని ఒక్కొక్క కుటుంబానికి 5కేజీ ల బియ్యం, 1కేజీ కందిపప్పు, 1 కేజీ గోధుమ పిండి, 1కేజీ ఆయిల్ , 1కేజీ సాల్ట్, 1/2 కేజీ పుట్నాల పప్పు, 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు, 100 గ్రాముల సాంబార్ పౌడర్, 100 గ్రాముల పసుపు, 100 గ్రాముల కారం మరియు ఒక కండువా చొప్పున అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే (Avanigadda MLA) బుద్ధప్రసాద్ కుమారుడు మండలి వెంకట్రామ్ అన్నారు. కృష్ణానది వరదలతో సర్వం కోల్పోయిన గ్రామాలలోని ప్రజలకు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చి జిల్లాల్లో సుమారుగా ఆరు వేల కుటుంబాలకు సహాయమందించిన తానా సంస్థకు, ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి కి, ఇతర తానా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి చొరవను ప్రశంసించారు.
ఈ తానా (Telugu Association of North America) ఫౌండేషన్ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో బొబ్బర్లంక గ్రామ (Bobbarlanka Village) సర్పంచ్ దొప్పలపూడి గంగాభవాని, టీడీపీ (Telugu Desam Party) గ్రామ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి బీవీ రావు, వేమూరి వెంకటరావు, స్వచ్ఛంద కార్యకర్తలు శశికళ, సోనీబాబు, సుకన్య, దివ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
మొత్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అటు తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో ఈ వరదల కష్టకాలంలో మేముసైతం అంటూ త్వరితగతిన సహాయం చేస్తున్న అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu), బోర్డు ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి (Dr. Nagendra Srinivas Kodali) మరియు ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి సారధ్యంలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా లీడర్షిప్ ని తెలుగుప్రజలు అభినందిస్తున్నారు.