Connect with us

Donation

తణుకులో వృద్ధులకు రాజా కసుకుర్తి సౌజన్యంతో తానా ఫౌండేషన్ సహాయం

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ అధ్వర్యంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి సౌజన్యంతో తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సంధ్యా జ్యోతి వృద్ధ జనాశ్రమం నందు వృద్దులకు రాజా కసుకుర్తి సమకూర్చిన చలి దుప్పట్లు, పండ్లు, ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్స్ పంపిణీ చేశారు.

తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి మాట్లాడుతూ పేదలకు, వృద్దులకు సేవ చేయడంలో తానా ఫౌండషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది అని చెప్పారు. సమాజానికి మార్గదర్శనం చేసిన వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అని తెలిపారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జనార్దన్ నిమ్మలపూడి సంధ్యా జ్యోతి వృద్ధ జనాశ్రమంకు 50 వేల రూపాయల అర్ధిక సహయం ప్రకటించారు.

తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, తణుకు పట్టణ తెదేపా అధ్యక్షులు కలగర వెంకట కృష్ణ, తానా లైబ్రరీస్ కోఆర్డినేటర్ చుండ్రు సతీష్, బసవ రామకృష్ణ, జయంతి ఖానరాజు, సంధ్యా జ్యోతి వృద్ధాశ్రమం ప్రెసిడెంట్ దొమ్మేటి వింధ్య మరియు తణుకు తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పుస్తక మహొధ్త్యమంలొ భాగంగా తానా కార్యవర్ఘ సభ్యులు పుస్తకములు బహుమతిగా అందించారు.

error: NRI2NRI.COM copyright content is protected