Connect with us

News

TANA Foundation లో 3 మిలియన్ల గోల్‌మాల్ కథ ఆ పెరుమాళ్ళకే ఎరుక?

Published

on

తానా ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరినీ సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్ లో వున్న బృహత్ టెక్నాలజీస్ (Bruhat Technologies Inc) కి సుమారు మూడు మిలియన్ డాలర్ల పైన నిధులు మళ్లించడాన్ని తానా బోర్డు చాల తీవ్రంగా పరిగణించింది. శ్రీకాంత్ పోలవరపు ఫౌండేషన్ మీటింగ్ లో డిస్కస్ చెయ్యకుండా ఫౌండేషన్ అనుమతి లేకుండా నిధులు మళ్లించారు.

ప్రస్తుత తానా (TANA) బోర్డు చైర్మన్ శ్రీ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరియు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శశికాంత్ వల్లేపల్లి శ్రీకాంత్ పోలవరపు (Srikanth Polavarapu) ని సంప్రదించగా నిధులు మళ్ళింపు నిజమే అని అది తన సొంత నిర్ణయం అని ఈ సంఘటనకి పూర్తి భాద్యత వహిస్తాను అని ఈమెయిల్ మెసేజ్ ద్వారా తెలిపారు.

నిధుల మళ్ళింపు సంఘటన పై నిన్న (శనివారం, 23 నవంబర్ 2024) తానా బోర్డు (TANA Board) అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశంలో బోర్డు సభ్యులు అందరు ఈ సంఘటనని తీవ్రంగా పరిగణించి దారి మళ్ళిన నిధులు వెనక్కి తీసుకు రావడానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలని తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారిని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసారు.

సోమవారం (25, నవంబర్ 2024 ) జరిగే తదుపరి బోర్డు సమావేశానికి హాజరు కావాలని శ్రీకాంత్ పోలవరపు కి షోకాజు నోటీసు జారీ చేసింది. తానా సభ్యుల మరియు దాతలకు సమాచారం ఎప్పటికి అప్పుడు అందచేస్తూ అలాగే నిధులు తానా ఫౌండేషన్ (TANA Foundation) అకౌంట్ కి తిరిగి వచ్చేటట్టు న్యాయపరమైన సలహాలు తీసుకుని తగు చర్యలు వెంటనే మొదలు పెడతాము అని, ఈ సంఘటన వల్ల తానా ఫౌండేషన్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటాం అని బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలియచేశారు.

error: NRI2NRI.COM copyright content is protected