Connect with us

Health

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో జోరందుకున్న TANA CPR, AED శిక్షణా శిబిరాలు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో సిపిఆర్ (CPR) మరియు ఎఇడి (AED) శిక్షణా శిబిరాలను సుమారు 100 పాఠశాలల్లో నిర్వహించేలా గత వారం ప్రణాళిక రచించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇందులో భాగంగా గుంటూరు (Guntur) లో ఆగస్టు చివరి వారంలో 7 పాఠశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు సెప్టెంబర్ 5న భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, భారత రత్న గ్రహీత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికొన్ని శిక్షణా శిబిరాలను ఏర్పాటుచేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె (Repalle) లోని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తానా న్యూఇంగ్లాండ్ రీజినల్ రిప్రజంటేటివ్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) ఆధ్వర్యంలో అత్యవస సమయాల్లో చేయాల్సిన CPR మరియు AED వంటి వాటిపై విద్యార్థులకు తర్ఫీదునిచ్చి అవగాహన కల్పించారు.

తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి (Srinivas Yenduri) ఈ శిక్షణా కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 4న వడ్లమూడి లోని విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో మరియు సెప్టెంబర్ 3న గుంటూరు లోని డా. కె ఎల్ పి పబ్లిక్ స్కూల్ లో CPR మరియు AED శిక్షణా శిబిరాలను వరుసగా నిర్వహించారు.

దీంతో వరుసగా 10 కి పైగా శిక్షణా కార్యక్రమాలతో విద్యార్థులను అత్యవసర సమయాల్లో ప్రాధమిక చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడేలా ట్రైనింగ్ ఇవ్వడంతో గుంటూరు జిల్లాలో CPR (Cardiopulmonary Resuscitation), AED (Automated External Defibrillator) శిక్షణా శిబిరాలు జోరందుకున్నట్లు ఉన్నాయంటున్నారు స్థానికులు.

ఇటు విద్యార్థులకు, అటు ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడేలా ‘తానా’ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli), తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మరియు తానా బోర్డు ఛైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి లను గుంటూరు జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected