Connect with us

Health

తానా ఫౌండేషన్ సరికొత్త సేవాకార్యక్రమం: ఆరుణ్య ప్రాజెక్ట్

Published

on

తానా ఫౌండేషన్ ఆధ్వర్యం లో సామినేని ఫౌండేషన్ దాతృత్వంతో ఖమ్మం జిల్లా మాటూరుపేట గ్రామంలో డిసెంబర్ 13 వ తేదీన ఆరుణ్య ప్రాజెక్ట్ మొదటి క్యాంపు విజయవంతంగా నిర్వహింపబడినది. దీనిలో 120 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో శస్త్రచికిత్స అవసరమైన వారికి ప్రభుత్వపథకాల ద్వారా ఆపరేషన్స్ చేస్తారు.

ఈ కార్యక్రమాన్ని రూపొందించిన తానా ఫౌండేషన్ ట్రస్టీ, కోఆర్డినేటర్ ఓరుగంటి శ్రీనివాస్ కి ప్రత్యేక అభినందనలు. తానా ఫౌండేషన్ రూపొందించిన ఈ నూతన ప్రాజెక్ట్ కు అందరూ తమవంతు సహాయం అందించవలసిందిగా తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ కోరారు. మాటూరుపేటలో ఈ క్యాంపు నిర్వహించుటకు తోడ్పడిన సామినేని నాగేశ్వరరావు (చైర్మన్ – సామినేని ట్రస్ట్), ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, ఆయన సిబ్బందికి, గ్రామ పెద్దలకు, వాలంటీర్స్ కు ధన్యవాదములు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected