Connect with us

Health

ఉచిత కంటి పరీక్షా శిబిరం విజయవంతం: తానా, రోటరీ హాస్పిటల్

Published

on

డిసెంబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు రోటరీ హాస్పిటల్ విజయవాడ సంయుక్తంగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ కంటి పరీక్షా శిబిరానికి గోపాలకృష్ణ శీలంనేని సమర్పకులు. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే, తోటరావులపాడు గ్రామ వాస్తవ్యులు సుధాకర్ శీలంనేని సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

దాదాపు మూడు వందల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న పెద్దల సూక్తులను నిజం చేస్తూ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఆధ్వర్యంలో తానా చేస్తున్న విభిన్నమైన సేవలు అభినందనీయం.

error: NRI2NRI.COM copyright content is protected