ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ గత ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నిరంజన్ శృంగవరపు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో మొట్టమొదటిసారిగా ఇండియా సందర్శించిన సందర్భంగా నిరంజన్ అభిమానులు బ్రహ్మరధం పట్టారు.
విమానాశ్రయం నుంచి కార్ల ర్యాలీతో తన స్వంత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎంటర్ అయ్యినప్పటినుంచి ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ముఖ్యంగా మహిళలు పూలతో స్వగతం తెలిపారు. డప్పులు, అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగింది.
విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ మంచి ఆహ్లాదంగా కనిపించారు నిరంజన్. తానాకి కాబోయే అధ్యక్షుని హోదాలో భారతావనిపై అడుగు పెడుతున్న మీకు హృదయపూర్వక స్వాగతం అంటూ పలుచోట్ల ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
నిరంజన్ ని అందరూ గజమాలతో సత్కరించారు. ఈ ట్రిప్ లో తెలుగు రాష్ట్రాల్లో పలు తానా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికాలో ఎన్ని సంఘాలున్నా ఏం పెట్టాడో దేవుడు ఆ తానా పదవిలో ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు తానా సభ్యులు.