Connect with us

Cultural

సౌత్ వెస్ట్ రీజియన్ లో వైభవంగా సాంస్కృతిక కళా మహోత్సవం: TANA @ Austin

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నిర్వహణలో సాంస్కృతిక కళా మహోత్సవం ఆస్టిన్ (Austin) లో సౌత్ వెస్ట్ రీజియన్ కోఆర్డినేటర్ సుమంత్ పుసులూరి (Sumanth Pusuluri) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 100 మంది ప్రదర్శించారు. కుటుంబసమేతంగా 400 మంది ఈ కార్యక్రమం వీక్షించటానికి పాల్గున్నారు. ఇందులో భాగంగా శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు వంటి వివిధ సాంస్కృతిక (Cultural) కళలను ప్రదర్శించారు.

తానా సాంస్కృతిక కళా మహోత్సవం కార్యక్రమ నిర్వహణలో శ్రీధర్ పోలవరపు, ప్రసాద్ కాకుమాను, బాలాజీ పర్వతనేని, లెనిన్ ఎర్రం, సతీష్ గన్నమనేని, సూర్య ముళ్ళపూడి, విగ్నేష్ మరియు సౌత్ వెస్ట్ రీజియన్ (Southwest Region) తానా వాలంటీర్స్ బాగస్వాములు అయ్యారు.

error: NRI2NRI.COM copyright content is protected