ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మొదటిసారిగా జాతీయ స్థాయిలో క్రికెట్ ఛాంపియన్షిప్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో సిటీ స్థాయి గ్రూప్ ఫార్మాట్, రీజియన్ స్థాయి నాకౌట్ ఫార్మాట్, మరియు జాతీయ స్థాయి నాకౌట్ ఫార్మాట్ లో గేమ్స్ ఉంటాయి. ముందుగా కర్టెన్ రైజర్ ఈవెంట్ లాగా షార్లెట్ నగరంలో సిటీ లెవెల్ టోర్నమెంట్ తో తానా జాతీయ స్థాయి క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది.
షార్లెట్ లోని రాబర్ట్ స్మిత్ పార్క్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఏప్రిల్ 23-24, ఏప్రిల్ 30-మే 1 తేదీలలో జరిగే ఈ సిటీ లెవెల్ కిక్ ఆఫ్ టోర్నమెంట్లో 16 జట్ల వరకు పాల్గొనే అవకాశం ఉంది. రెజిస్ట్రేషన్ రుసుము 250 డాలర్లు కట్టి ఏప్రిల్ 8వ తేదీ లోపు జట్లన్నీ నమోదు చేసుకోవాలి. ఒక్కో జట్టులో మాగ్జిమం 15 ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. అన్ని మ్యాచెస్ కూడా హార్డ్ టెన్నిస్ కలర్ బాల్ తోనే ఆడతారు. గెలిచిన జట్టుకి 1500 డాలర్లు, రన్నర్ జట్టుకి 750 డాలర్లు ప్రైజ్ మనీ తోపాటు ట్రోఫీస్ అందజేస్తారు.
ఈ సిటీ లెవెల్ టోర్నమెంట్లో గెలిచిన జట్టు అపలాచియన్ రీజియన్ లెవెల్లో ఇతర సిటీ లెవెల్ టోర్నమెంట్స్లో గెలిచిన జట్లతో నాకౌట్ ఫార్మాట్లో తలపడతాయి. అలాగే అపలాచియన్ రీజియన్ లెవెల్లో గెలిచిన జట్టు తదుపరి జాతీయస్థాయిలో మిగతా రీజియన్స్ లో గెలిచిన జట్లతో నాకౌట్ ఫార్మాట్లో తలపడనున్నాయి.
షార్లెట్లో జరిగే ఈ సిటీ లెవెల్ టోర్నమెంట్ అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో స్థానిక తానా నేతలు శ్రీనివాస్ చాంద్ గొర్రెపాటి, పురుషోత్తమ చౌదరి గుదే, సురేష్ కాకర్ల, ఠాగూర్ మలినేని సహకారంతో నిర్వహించనున్నారు. అలాగే శ్రీధర్ పెళ్లూరు, వెంకీ అడుసుమిల్లి, లక్ష్మీపతి జూలపల్లి మరియు అశ్విన్ యడ్లపల్లి ఈ టోర్నమెంట్ ను సమన్వయపరచడంలో తోడ్పడనున్నారు.
తానా జాతీయ లీడర్షిప్ అంతా కూడా ఈ టోర్నమెంట్ కిక్ ఆఫ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర నగరాల్లో నిర్వహించే టోర్నమెంట్ వివరాల కొరకు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ, రాజ్ యార్లగడ్డ, క్రీడల ఛైర్స్, కోఛైర్స్, క్రీడా కమిటీ సభ్యులు లేదా ఆయా స్థానిక ప్రాంతీయ కార్యదర్సులను సంప్రదించండి.