Atlanta, Georgia: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వివిధ కార్యక్రమాలను కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానా సౌత్ ఈస్ట్ విభాగంవారు అట్లాంటాలో నిర్వహించిన ‘సి.పి.ఆర్ అవగాహన మరియు శిక్షణ’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.
మార్చి 29న స్థానిక ‘అకేషన్స్’ (Occasions Atlanta) వేదికగా జరిగిన ఈ శిబిరానికి ఆ ప్రాంతంలో ఉన్న తెలుగువారు హాజరై ఆపత్కాలంలో చేయాల్సిన వైద్యచికిత్స చర్యలను ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లలిత మేడెపల్లి (Dr. Lalitha Medepalli) ద్వారా తెలుసుకున్నారు.
హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్
ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లలిత మేడెపల్లి తన బృందంతో కలిసి ఈ శిక్షణను అందించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్సగా సి.పి.ఆర్ (Cardiopulmonary resuscitation) ఎలా చేయాలో ప్రత్యక్షంగా వివరించారు.
ఇందులో పాల్గొన్న 50 మందికి పైగా సభ్యులకు బొమ్మల ద్వారా హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ చేయించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం అందే వరకు ప్రాణం నిలబెట్టే ఈ నైపుణ్యంపై అందరికీ అవగాహన కల్పించారు.
నాయకత్వ సమన్వయం
తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Dr. Naren Kodali), ఈవీపీ శ్రీని లావు (Srinivas Lavu) ల ప్రోత్సాహంతో, ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహిని అయనాల (Sohini Ayinala) ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, సమాజంలో ఆరోగ్య స్పృహ పెంచే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ రీజినల్ రిప్రజెంటేటివ్ శేఖర్ కొల్లు (Shekar Kollu), ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu), సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ CPR Training కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన స్థానిక తానా ప్రతినిధులు మాలతి నాగభైరవ (Malathi Nagabhirava), పూలని జాస్తి, ఆర్తిక అన్నే (AArthika Anne), శ్రీనివాస్ ఉప్పు, అనిల్ యలమంచిలి (Anil Yalamanchili), కోటి కందిమళ్ల, నరేన్ నల్లూరి, చైతన్య కొర్రపాటిల కృషిని నాయకత్వం అభినందించింది. వేదికను సమకూర్చిన కిషోర్ తాటికొండ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.