Connect with us

News

సెలెక్షన్ వద్దు, ఎలక్షన్ ముద్దు; Court says TANA Leadership Null & Void

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కి మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్ట్ నుండి ఎదురు దెబ్బ తగిలింది. 23వ మహాసభల అనంతరం 2023-25 కాలానికి ఎన్నికలు నిర్వహించకుండా సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా తానా తదుపరి నాయకత్వాన్ని (EC, Board, Foundation) ఎన్నుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

కొంచెం వెనక్కి వెళితే… వర్గపోరు నేపథ్యంలో కొత్తగా చేరిన సభ్యులకు తానా ఓటు హక్కు ఇవ్వకపోవడం, దీనిపై కొందరు కోర్ట్ కి వెళ్లడం, కోర్ట్ తీర్పు ఆలస్యంగా రావడం ఇతరత్రా వంటి పలు రకాల కారణాలతో అప్పటి తానా బోర్డు ఎన్నికలు (Elections) నిర్వహించలేకపోయింది.

అనంతరం 23వ మహాసభలకు (Convention) సమయం మించిపోతుండడంతో ఫోకస్ దాని మీదకి మార్చారు. ఈలోపు పెద్దలు, మధ్యవర్తుల సమన్వయంతో 23వ మహాసభలు ముగిసిన తర్వాత రోజునే మూడు వర్గాలు కూర్చొని రాజీ కొచ్చి, తమ అనుయాయులతో పదవుల పందేరం (Selection) చేసుకొని, 2023-25 కాలానికి లీడర్షిప్ లో కూర్చోపెట్టారు.

అనుకున్నట్టుగానే పదవులు రాని వారు, ఎప్పటి నుంచో తానా (Telugu Association of North America) లో సేవలందిస్తున్నవారు సెలెక్షన్ వద్దు, ఎలక్షన్ ముద్దు అంటూ మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్ట్ (Circuit Court for Montgomery County, Maryland) తలుపులు తట్టారు. తదనంతర పరిస్థితుల రీత్యా గతంలో రాజీకి ఒప్పుకున్నవారు కూడా ఈ కేసుకి మద్దతివ్వడం విశేషం.

మిగతా కేసుల లాగానే తీర్పు వచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్తా పూర్తి అయి, చాలాకాలం పడుతుందనుకున్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్ట్ జడ్జి TRO (Temporary Restraining Order) ఇచ్చారు. దీని ప్రకారం సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఎన్నికైన తానా నాయకత్వాన్ని రద్దు చేసి, తానా పాత బోర్డు సభ్యులను పునరుద్ధరిస్తూ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పూర్తి జడ్జిమెంట్ కాపీ కొరకు ఇక్కడ www.NRI2NRI.com/TANA Court Case CV-15-CV-23-003331 క్లిక్ చేయండి.

జడ్జి (Judge) తీర్పు గత వారమే ఇచ్చినప్పటికీ, తీర్పు కాపీ అందరికీ ఈరోజు సెప్టెంబర్ 29న అందింది. వచ్చే 90 రోజులలో ఎన్నికలు నిర్వహించాల్సి రావడం, కొందరు ఒక వర్గం నుంచి ఇంకో వర్గం వైపు వచ్చేలా అడుగులు వేయడం, మరికొందరు నిస్తేజంతో అసలు పోటీ నుంచి తప్పుకుంటామనడం, కొత్తగా కొంతమంది రేసులోకి దూకడం, జడ్జి తీర్పుని కూడా ఎవరికివారు తమకు అనుకూలంగా అన్వయించుకోవడం, ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆసన్నమవడం వంటి పరిస్థితుల్లో తానాలో పరిస్థితులు ఆసక్తికరంగా మారనున్నాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected