Connect with us

Conference

తానా మహాసభలకు అతిథిగా ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడి

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా ఘనంగా నిర్వహించనున్న విషయం అందరికీ విదితమే.

ఇందులో భాగంగా భారతదేశంలోని ప్రముఖులను ఆహ్వానించేందుకు తానా 23వ మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి (Ravi Potluri), ఇండియా వ్యవహారాల డైరెక్టర్ వంశీ కోట (Vamsi Kota) తదితరుల బృందం ఇండియా వెళ్లారు. నిన్న టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడి ని కలిసి తానా మహాసభలకు అతిథిగా ఆహ్వానించారు. వీరితోపాటు ప్రసాద్ గారపాటి మరియు సుబ్రమణ్యం ఓసూరు ఉన్నారు.

అనిల్ రావిపూడి 2015 నుంచి టాలీవుడ్ టాప్ హీరోస్ తో పటాస్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం నందమూరి అందగాడు బాలక్రిష్ణ తో సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ యువ దర్శకులు తానా మహాసభలకు అట్రాక్షన్ తీసుకొస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected