Connect with us

Telangana

TANA Conference: తెలంగాణ మంత్రులకు, సీనియర్ నాయకులకు ఆహ్వానం

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే.

దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ఊపందుకున్నాయి. అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా నిర్వహించనున్న ఈ తానా 23వ మహాసభలకు సంబంధించి పలు నగరాల్లో కిక్‌ ఆఫ్‌ మీటింగ్స్ మరియు ఫండ్రైజర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇంకోపక్క ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మహాసభల కమిటీల సభ్యులు తమ పరిధిలో సమావేశమవుతూ పనులు చక్కబెడుతున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలోని ప్రముఖులను ఆహ్వానించేందుకు తానా 23వ మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి (Ravi Potluri) సారధ్యంలోని బృందం హైదరాబాద్ చేరుకుంది.

వీరిలో తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి (Sasi Kanth Vallepalli), ఇండియా వ్యవహారాల డైరెక్టర్ వంశీ కోట (Vamsi Kota), కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఛైర్ జగదీశ్ ప్రభల (Jagadish Prabhala), సుబ్రమణ్యం ఓసూరు, ముప్పా రాజశేఖర్ తదితరులు ఉన్నారు. వీరందరూ హైదరాబాద్ లో పలువురు తెలంగాణ నాయకులను కలిసి తానా మహాసభలకు రావలసిందిగా కోరారు.

తానా మహాసభల (TANA Conference) ఆహ్వాన పత్రాలను అందించిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు తనీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ వినోద్ కుమార్ లతోపాటు ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి మరియు టీవీ9 రజనీకాంత్ ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected