Connect with us

News

కేంద్ర మంత్రులు, MPలకు తానా కన్వెన్షన్ కమిటీ సాదర ఆహ్వానం @ Delhi, India

Published

on

Delhi, India: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నాయకులు డెట్రాయిట్, నోవై (Novi, Detroit) లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే 24వ మహాసభలను పురస్కరించుకుని ఢిల్లీ (Delhi) లో పలువురు కేంద్ర మంత్రులను, ఎంపిలను స్వయంగా కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌ (Pemmasani Chandra Sekhar), భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathi Raju Srinivasa Varma), రామ్మోహన్‌ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తోపాటు ఎంపీలు కేశినేని చిన్ని (Kesineni Sivanath), దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari), సిఎం. రమేశ్‌ (Chintakunta Munuswamy Ramesh), లావు కృష్ణ దేవరాయ (Lavu Sri Krishna Devarayalu) తదితరులను కలిశారు. మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

వారు కూడా తాము వస్తామని చెప్పినట్లు తానా నాయకులు పేర్కొన్నారు. తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాదెళ్ళ (Gangadhar Nadella), మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి (Jayaram Komati), కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, పాతూరి నాగభూషణం, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి తదితరులు కేంద్రమంత్రులను,ఎంపిలను కలిసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. మరోవైపు కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu) డెట్రాయిట్‌లో జరగనున్న తానా మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురితో సమావేశమవుతున్నారు.