Connect with us

Convention

రవి పొట్లూరి నేతృత్వంలో కొనసాగుతున్న తానా సభల ఆహ్వాన పర్వం: India

Published

on

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభల (Conference) ఆహ్వాన పర్వం రవి పొట్లూరి నేతృత్వంలో కొనసాగుతుంది.

తానా 23వ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరు కావలసిందిగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (Nuthalapati Venkata Ramana), భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu), ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబిఎన్ న్యూస్ ఛానల్ అధినేత వేమూరి రాధా కృష్ణ (Vemuri Radhakrishna) లను ఆహ్వానించారు.

అలాగే ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ5 (TV5) అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. గద్దె రాజేంద్ర ప్రసాద్, టాలీవుడ్ దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్ర రావు (K. Raghavendra Rao) లను కలిసి తానా 23వ మహాసభలకు ఆహ్వానించారు.

నంది పురస్కార గ్రహీత, నటులు, నిర్మాత, జయభేరి గ్రూపు అధిపతి, రాజమండ్రి నియోజక వర్గం మాజీ లోక్ సభ సభ్యులు మాగంటి మురళీమోహన్ (Murali Mohan), భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు (Nama Nageswara Rao) ను తానా ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

ఇంకా రైతన్న నేస్తం, మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ, విద్యావేత్త, విజ్ఞాన్ సంస్థల వ్యవస్థాపకులు లావు రత్తయ్య (Lavu Rathaiah), ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభ్యులు, సంగం పాల డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) లను ఆహ్వానించారు.

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కూడా ఆహ్వానం అందుకున్న ప్రముఖులలో ఉన్నారు.

ఈ ఆహ్వాన పత్రాలు అందజేసిన వారిలో తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తోపాటు ఇండియా వ్యవహారాల డైరెక్టర్ వంశీ కోట (Vamsi Kota), కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఛైర్ జగదీశ్ ప్రభల (Jagadish Prabhala), ప్రసాద్ గారపాటి, సుబ్రమణ్యం ఓసూరు, రఘు శంకరమంచి, ముప్పా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected