Connect with us

Associations

వాడిగా వేడిగా మొదలై చల్లగా ముగిసిన తానా కమిటీల సమావేశం

Published

on

తానాలో పదవుల పంపకం చివరి ఘట్టానికి చేరింది. 2021-23 టర్మ్ కి జాతీయ, ప్రాంతీయ ఎడ్హాక్ కమిటీలు అలాగే సిటీ కోఆర్డినేటర్స్ నియామకాల కోసం ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా కార్యనిర్వాహకవర్గం సెప్టెంబర్ 8 న సమావేశమైంది. ముందుగా వెబ్ కమిటీ విషయంలో వాడిగా వేడిగా భావోద్వేగంతో మొదలైన సమావేశం, ఒక ప్రాంతీయ ప్రతినిధి లేవనెత్తిన అభ్యంతరంతో పతాకస్థాయికి చేరి, చివరికి నిప్పులమీద నీళ్లు పోసినట్టు చల్లగా ముగిసింది.

ఈ సమావేశంలో ఈవెంట్స్ సమన్వయకర్తగా శ్రీనివాస్ కూకట్ల, మెంబర్షిప్ బెనిఫిట్స్ సమన్వయకర్తగా శ్రీని యలవర్తి, మీడియా సమన్వయకర్తగా ఠాగూర్ మల్లినేని ప్రత్యేక ఈసీ కోఆర్డినేటర్స్ గా నియమితులయ్యారు. వెబ్ కమిటీ చైర్మన్ గా బిల్హన్ చౌదరి ఆలపాటి, అలాగే ప్రాముఖ్యత ఉన్న టీం స్క్వేర్, కల్చరల్, తానా కేర్స్, ఉమెన్స్ ఫోరమ్, పాఠశాల, బ్యాక్ ప్యాక్, కళాశాల, అగ్రికల్చర్ ఫోరమ్, బాలోత్సవం, మెంబర్షిప్ బెనిఫిట్స్ తదితర జాతీయ, ప్రాంతీయ ఎడ్హాక్ కమిటీలకి ఛైర్మన్, కోఛైర్మన్ లను మరియు సిటీ కోఆర్డినేటర్స్ ని నియమించారు.

కాకపోతే ఈ పదవులు పొందినవారిని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. మొన్నటి తానా ఎలక్షన్స్ లో సహాయసహకారాలందించిన ప్రతి ఒక్కరికీ, వర్గాలకతీతంగా తానా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారికి పదవులు ఇస్తూ కలుపుకెళ్ళడం ద్వారా చాకచక్యంగా వ్యహరించినట్లు తెలుస్తుంది.

error: NRI2NRI.COM copyright content is protected