. వరద భాదితులకు తానా చేయూత @ New York
. విరాళాల సేకరణ కోసం న్యూయార్క్ లో ఆట పాట.
. అతిధి గా వచ్చిన నటి, యాంకర్ సుమ కనకాల.
. ఉభయ రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రులకు విరాళాలు అందజేత.
New York, September 15, 2024: తెలుగు వారికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి చేయూతనిచ్చి తోడు నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA, ఉభయ తెలుగు రాష్ట్రాలలో (Telugu States) వరద సృష్టించిన విలయానికి నష్టపోయిన బాధితులకు (Flood Victims) అండగా నిలిచింది.
వేలాదిగా ప్రాణ నష్టం, ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులు కావడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, వీటన్నిటికీ చలించిన “తానా’- సేన మానవతా దృక్పధంతో బాధిత ప్రాంతాలలో నిత్యావసర రేషన్ కిట్లను అందించింది. అలాగే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికాలో కూడా దాతల నుంచి విరాళాలు (Donations)సేకరించి బాధితులకు వివిధ రకాలుగా తోడ్పడుతోంది.
ఈ విరాళాల సేకరణ కార్యక్రమం లో భాగంగా తానా సెప్టెంబర్ 15 వతేదీన న్యూ యార్కు (New York) లో ప్రముఖ యాంకర్ సుమ తో “ఆట పాట’ కార్యక్రమం నిర్వహించింది. నటి, యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) సమయస్ఫూర్తి, హాస్య సంభాషణలను మేళవించి సభాకార్య క్రమాన్ని అలరించారు. ప్రతీ టేబుల్ వద్దకు వెళ్ళి ఆహుతులను ఆట పాటల్లో ముంచెత్తుతూ ఉర్రూతలూగించారు.
దాదాపు 200 కి పైగా దాతలు హాజరైన ఈ కార్యక్రమం ఉభయ రాష్ట్రాల (Telugu States) లోని తెలుగు వారికి వరద సహాయాన్ని అందించడానికి తమవంతుగా ఉదారంగా విరాళాలు అందించారు. మానవతా దృక్పధం తో తానా చేస్తున్న కృషిని న్యూయార్క్ (New York) ప్రముఖులు ప్రశంసించారు.
జయ్ తాళ్ళూరి, మోహన్ బాధే, కల్పన వనం, రావు వోలెటి, దేవ రత్నం, కృష్ణ గుజవర్తి, పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపట్ల, తిరుమల రావు తిపిర్నేని, కిషోర్ కుంచం, శ్రీదేవి భూమి, జగ్గా అల్లూరి బాధితుల కష్టాల వివరాలు విని స్పందించి విరాళాలు అందించారు. వచ్చిన పది లక్షల రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందజేశారు.
తానా (Telugu Association of North America) సంస్థ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సమ్మెట, శిరీష తూనుగుంట్ల (Sirisha Tunuguntla), సుమంత్ రామిశెట్టి (Sumanth Ramsetti) సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు డా. నోరి దత్తాత్రేయ, నెహ్రూ చెరుకుపల్లి, TLCA, NYTTA, TTA, MATA సంస్థల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
శ్రీలక్ష్మి కులకర్ణి (Srilakshmi Kulkarni) వ్యాఖ్యాత గా వ్యవహరించారు. సత్య చల్లపల్లి, జయప్రకాష్ ఇంజపూరి, శైలజా చల్లపల్లి, విజయ్ లోతుగడ్డ, సాయి దేవినేని, మురళీ సహకారం అందించారు. తానా కార్యవర్గం రావు వోలెటి, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ భర్తవరపు, యమున, శైలజ శంకర్ సహకరించారు.
ఈ సందర్బంగా తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, పరివ్యాప్తం చేయడం, ఉత్తర అమెరికా లో నివసిస్తున్న తెలుగు ప్రజల, వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడంలో ముందుంటుందన్నారు. తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా తానా ఉందన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, వరద బాధితులకు ఇతోధికంగా సహాయం చేయడంలో దోహదపడిన న్యూయార్క్ కార్యవర్గానికి తానా (TANA) అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, పూర్వాధ్యక్షులు జయ తాళ్ళూరి (Jay Talluri), వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి మరియు పూర్వాధ్యక్షులు అంజయ్య చౌదరి లావు లు అభినందనలు తెలిపారు.