చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా డిసెంబర్ 19న కృష్ణా జిల్లా, బెజవాడ కెఎల్ యూనివర్సిటీలో తానా సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుండి యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవనున్నారు.
గ్రామీణ కళలు, జానపద నృత్య ప్రదర్శనలు మరుగున పడిపోకుండా, కళాకారులను ప్రోత్సాహిస్తూ గ్రామీణ ఆట పాటలు, సంగీత సాహిత్య సాంస్కృతిక కళల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ వారు ఈ సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహిస్తున్నారు.
రైతులు మరియు పేదలకు చేయూతనందిస్తూ తెలుగువారి కోసం తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో గంగా జాతర జానపద నృత్యాలు, ప్రతిభ గల బాలికల గ్రూపుతో చెక్క భజనలు, గ్రామీణ విశిష్టతను తెలియ చేసే డప్పుల నైపుణ్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.
అలాగే ప్రత్యేక వాయిద్యాలతో జానపద కళా ప్రదర్శనలు, నిప్పు కుండలతో ఆసక్తి రేకెత్తించే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, మ్యూజిక్ బ్యాండ్ తో తెలుగు పాటలు వంటి అద్భుతమైన కార్యక్రమాలు ప్రత్యేకం. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అంటూ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు తానా చైతన్య స్రవంతి బృందం.