Philadelphia, Pennsylvania: Telugu Association of North America (TANA) మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్చ్ 8, 2025న ఫిలడెల్ఫియాలో (Philadelphia) అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ (West Chester) నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ (Peirce Middle School) లో నిర్వహించిన ఈ వేడుకలకు 1000 మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ (Delaware) రాష్ట్రంలోని డోవర్ (Dover) నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా (Dr Janaki Kaza) గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు.
మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని, చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు.
తానా మిడ్ అట్లాంటిక్ (TANA-Mid Atlantic) మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి (Saroja Pavuluri) నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి, రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.
తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ (TANA Foundation) మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు కాజా, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
డెలావేర్ (Delaware) మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు. 2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాథ్ కోగంటి లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.