Connect with us

Sports

తానా కరోలినాస్ Badminton League‌ పోటీలు విజయవంతం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ప్రతిభకల క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటోంది. సెప్టెంబర్‌ 21న తానా కరోలినాస్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (Badminton League) పోటీలను విజయవంతంగా నిర్వహించింది.

కిడ్స్‌ డబుల్స్‌, యూత్‌ డబుల్స్‌, మెన్స్‌ డబుల్స్‌, ఉమెన్‌ డబుల్స్‌, మిక్స్డ్‌ డబుల్స్‌ పోటీలతోపాటు ప్రత్యేకంగా లెజెండ్స్‌ కోసం కూడా ఇందులో పోటీని ఏర్పాటు చేసి సరికొత్త ఆటకు శ్రీకారం చుట్టింది. 40 పదుల వయస్సులో ఉండే క్రీడాకారులకోసం నిర్వహించిన పోటీలలో కూడా పలువురు పాల్గొని తమ ప్రతిభను చాటారు.

14 గంటలపాటు సాగిన ఈ పోటీల్లో పలు టీమ్‌ లు పాల్గొన్నాయి. 8 కోర్టులలో 230 ఆటలతో సాగిన ఈ పోటీలు రసవత్తరంగా సాగడంతో వచ్చిన ప్రేక్షకులు కూడా సంతోషంతో క్రీడాకారులను చప్పట్లతో ప్రోత్సహించారు. దాదాపు 200 మందికిపైగా ప్రేక్షకులు ఈ పోటీలకు హాజరవడం విశేషం.

ఈ తానా కరోలినాస్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (Badminton League) పోటీల్లో ఒక విభాగంలో విజేతగా తండ్రీ కొడుకులు నిలవడం విశేషంగా చెప్పవచ్చు. తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి (Naga Panchumarti) మాట్లాడుతూ, 40 ఏళ్ళ వయస్సు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు కూడా మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.

ఈ తానా కరోలినాస్‌ (TANA Carolina’s) బ్యాడ్మింటన్‌ లీగ్‌ (Badminton League) పోటీల్లో ఎంతోమంది క్రీడాకారులు (Sports Personnel) పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని, తానా ఇలాంటి పోటీలను మరిన్ని నిర్వహించి ఆటగాళ్ళ ప్రతిభను వెలికి తీస్తుందన్నారు.


ఈ పోటీల విజయవంతానికి తానా ఈవెంట్ కో ఆర్డినేటర్‌ అమూల్య కుడుపూడి, దినేష్ డొంగా, తానా రీజినల్ కో ఆర్డినేటర్‌ ‌‌రాజేష్‌ యార్లగడ్డ, తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్ మల్లినేని, టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి, రవి వడ్లమూడి, తానా లోకల్ టీం తదితరులు కృషి చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected