డిసెంబర్ 9న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ టాక్స్ వెబినార్ నిర్వహించింది. లావు అంజయ్య చౌదరి అధక్షతన, తానా సంయుక్త కార్యదర్శి మురళి తాళ్లూరి సమన్వయపరిచిన ఈ సెమినార్ కు వక్త ఏజి ఫిన్ టాక్స్ అధినేత అనిల్ గ్రంధి. చిన్న చిన్న వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సెమినార్లో వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు.
ముందుగా తానా జాయింట్ సెక్రటరీ మురళి తాళ్లూరి స్వాగతోపన్యాసం చేసి ఈ సెమినార్ వక్త అనిల్ గ్రంధి ని పరిచయం చేసారు. అలాగే తానా ప్రధాన కార్యదర్శి సతీష్ వేమూరి తనకు అనిల్ తో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం అనిల్ తన ప్రొఫైల్ ని క్లుప్తంగా వివరించి వెబినార్ మెయిన్ టాపిక్స్ లోకి వెళ్లారు.
సంవత్సరాంతంలో టాక్స్ సేవింగ్స్ కోసం ప్రణాళికలు, క్యాపిటల్ గెయిన్ టాక్స్ తగ్గించుకునే విధానాలు, అంకుల్ శామ్ ఐ ఆర్ ఎస్ తో ఇబ్బందులు రాకుండా లీగల్ గా అనుసరించాల్సిన వ్యాపార సూత్రాలు, బిజినెస్ డిడక్షన్స్, పన్ను మినహాయింపులు, బుక్ కీపింగ్ తదితర అంశాలపై సుదీర్ఘంగా అనిల్ గ్రంధి వివరించారు. అలాగే వెబినార్ లో పాల్గొన్నవారి సందేహాలను నివృత్తి చేసారు. చివరిగా తానా సంయుక్త కార్యదర్శి మురళి తాళ్లూరి వక్త అనిల్ కి, పాల్గొన్నవారికి, అలాగే ఈ వెబినార్ నిర్వహణలో లో తనకు సహాయపడిని తానా నాయకులకు ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.