Connect with us

News

తానా ముఖాముఖి కార్యవర్గ సమావేశం రద్దు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఆధ్వర్యంలో అక్టోబర్ 23 వారాంతం మొట్టమొదటి ముఖాముఖి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు మరియు ఫౌండేషన్ సభ్యులు వీలుపడక రాకపోనుండడంతో ఈ సమావేశం రద్దయినట్లు తెలిసింది.

ఇయర్ ఎండ్ హాలిడే సీజన్ దగ్గిరలో ఉండడంతో ఇక ఈ సంవత్సరం ముఖాముఖి సమావేశం లేనట్లేనేమో. వచ్చే సంవత్సరం మొదటి భాగంలో అందరికి అనువుగా ఒక వారాంతం సమావేశమయ్యేలా ప్లాన్ చెయ్యాలని కార్యవర్గం తలంపులా తెలుస్తుంది. అప్పటి వరకు ఎప్పటిలానే ఆన్లైన్లో జూమ్ మీటింగ్స్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తారు. కాబట్టి తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు మరియు ఫౌండేషన్ సభ్యులందరినీ ఒకే వేదికపై చూడాలంటే క్యాలెండర్లో సంవత్సరం మారాల్సిందే.

error: NRI2NRI.COM copyright content is protected