ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 3 నుంచి 5 వరకు హెలెన్ లోని యూనికాయ్ స్టేట్ పార్క్ లో పిక్నిక్ నిర్వహించారు. సుమారు 150 మంది పాల్గొన్న ఈ విహారయాత్రలో పిల్లలకు పెద్దలకు మంచి కార్యకలాపాలు ప్లాన్ చేసారు. ఆగష్టు 3 న సాయంత్రం 6 గంటలకల్లా అందరూ హెలెన్ చేరుకొని మాటామంతితో విహారయాత్ర మొదలుపెట్టారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆగష్టు 4 న నిర్వహించిన వాటర్ స్పోర్ట్స్, కాయకింగ్, ఆర్చరీ, ఎయిర్ గన్, పాడిల్ బోర్డింగ్, వాటర్ బెలూన్స్, ఫ్లైయింగ్ ఫిషింగ్, షటిల్, శాక్ రేస్ తదితర కార్యకలాపాలలో చిన్నలు పెద్దలు ఉత్సాహంగా రోజంతా పాల్గొన్నారు. ఈ మధ్యనే కొత్తగా మొదలుపెట్టిన శ్రీనివాస్ నిమ్మగడ్డ గారి సంక్రాతి రెస్టారెంట్ వాళ్ళు లైవ్ కుకింగ్, గ్రిల్లింగ్ వంటకాలతో బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ సర్వ్ చెయ్యడం విశేషం. వేసవి విడుపుగా ఇంత చక్కని పిక్నిక్ని తానా తరపున నిర్వహించిన అట్లాంటా సభ్యులు భరత్ మద్దినేని, వినయ్ మద్దినేని, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, అనిల్ యలమంచిలి, బిల్హన్ ఆలపాటి, మురళి బొడ్డు, వెంకీ గద్దె, ఆదిత్య గాలి తదితరులను అందరూ అభినందించారు. ఆగష్టు 5 న నిర్వహించిన స్కావెంజర్ హంట్ కార్యక్రమం ముగించుకొని అందరు తిరిగి ఇంటిముఖం పట్టారు.