Connect with us

News

TANA కమిటీలలో కిరణ్‌, సాయి, బిల్హన్‌, మాలతి, భాను, సుధీర్‌, శ్రీనివాస్‌ నియామకం

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (TANA Executive Committee) ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు.

తానా (Telugu Association of North America) లో ముఖ్యమైన టీమ్‌ స్క్వేర్‌ (TEAM SQUARE) కమిటీకి చైర్‌ పర్సన్‌గా కిరణ్‌ కొత్తపల్లి ని నియమించారు. తానా పత్రిక చైర్‌ పర్సన్‌గా సాయి బ్రహ్మానందం గొర్తి, తానా వెబ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా బిల్హన్‌ ఆలపాటి, తానా కళాశాల చైర్‌ పర్సన్‌గా మాలతి నాగభైరవ ఎంపికయ్యారు.

అలాగే ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ పాఠశాల చైర్‌ పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌ షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యులుగా సుధీర్‌ చింతమనేని, శ్రీనివాస్‌ వల్లూరిపల్లి లను నియమించినట్లు తానా (TANA) కార్యదర్శి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected