ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపల్లెలో మూడురోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా ఫౌండేషన్ (TANA Foundation) ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న పేదలకోసం ‘అన్నపూర్ణ’ కార్యక్రమాన్ని గతంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమములో అభాగ్యులకు అన్నపూర్ణ కార్యక్రమం ద్వారా అవసరం వున్నచోట భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇటీవల రేపల్లెలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali) మాట్లాడుతూ, తానా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోంది. అన్నీ దానాల్లో కన్నా అన్నదానం మిన్న అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ పేరుతో పేదలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు.
మూడు రోజుల పాటు, అన్నార్తులు అందరికి శ్రద్ధ మరియు ప్రేమతో తానా వాలంటీర్ (TANA Volunteers) లు వడ్డించారు, పండుగ విందు కంటే తక్కువ లేని భోజనాన్ని అందించారు మెనూ సమృద్ధిగా మరియు వైవిధ్యంగా ఉంది. ఇందులో ప్రతిరోజూ వివిధ రకాల తో కూడుకున్న కూరలు మరియు పిండివంటలు ఉన్నాయి.
ఈ కార్యక్రమం ఎదో పేరు కోసం అన్నదానం చేసాము తు తు మంత్రం లాగ కాకుండా, కృతజ్ఞత మరియు సమాజ స్ఫూర్తితో నిండిన పండుగలా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యం మరోసారి సమాజానికి తిరిగి ఇవ్వడం మరియు ఒకరినొకరు చూసుకునే తెలుగు సంప్రదాయాన్ని కాపాడుకోవడం పట్ల తానా (TANA) యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
ఈ కార్యక్రమానికి సహకరించిన చంద్రశేఖర్ కంతేటి టీం కు పేరు పేరు న తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటీ సభ్యులు కృష్ణప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన వారికి ఆసరా విధానము గా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, తానా బోర్డు అఫ్ డైరెక్టర్స్ కి, తానా ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) కి ధన్యవాదాలు తెలిపారు.
రేపల్లె (Repalle, Andhra Pradesh) స్థానికులు సమాజములో ప్రతిఫలాక్ష లేకుండా, నిస్సందేహముగా నిస్వార్ధ సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన తానా (Telugu Association of North America – TANA) అన్నవితరణ “అన్నపూర్ణ” కార్యక్రమానికి ప్రశంసలను వ్యక్తం చేశారు.