తానాలో 2021-23 టర్మ్ కి ఎడ్హాక్ కమిటీల సందడి మొదలైనట్టు కనబడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా అమెరికాలో ఎన్ని తెలుగు సంఘాలున్నా తానా కున్న క్రేజ్ మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఆఖరికి ఎడ్హాక్ కమిటీ పదవులకు కూడా ఉన్న డిమాండే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు మరియు ఫౌండేషన్ ల తతంగం ముగియడంతో తదుపరి ఎడ్హాక్ కమిటీల ఏర్పాటు సందడి ప్రారంభమైంది. ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన నిన్న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగులో కొన్ని క్రియాశీల ఎడ్హాక్ కమిటీల ఛైర్మన్ మరియు కోఛైర్మన్ పదవులను పూరించినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా క్రియాశీలక పాత్ర పోషించే టీం స్క్వేర్ ఛైర్మన్ గా అపలాచియాన్ ప్రాంతంలో తానా పురోగతికి తోడ్పడిన నార్త్ కరోలినా క్యారీ వాసి సురేష్ కాకర్ల, బ్యాక్ ప్యాక్ పంపిణీ కమిటీ ఛైర్మన్ గా డల్లాస్ నుంచి అందరికీ సుపరిచితులైన పరమేష్ దేవినేని నియమితులయ్యారు. పోయిన టర్మ్ లోలానే తిరిగి మళ్ళీ అదే కమిటీలకు ఎన్నికైన వారిలో కళాశాల ప్రోగ్రామ్స్ ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లిన డల్లాస్ వాసి ఛైర్మన్ రాజేష్ అడుసుమిల్లి, పాఠశాల తానాలో విలీనం అయినప్పటినుంచి చొరవ తీసుకొని ముందుండి నడిపిస్తున్న పెన్సిల్వేనియా వాసి చైర్మన్ నాగరాజు నలజల ఉన్నారు. ఇంకా మరికొన్ని ఎడ్హాక్ కమిటీలు, సిటీ కోఆర్డినేటర్ల నియామకం పెండింగులో ఉన్నట్టు తెలుస్తుంది.