ఖమ్మం కలెక్టర్ ఆఫీసు లో డిసెంబర్ 16న తానా ఫౌండేషన్ మరియు సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గౌతమ్ మరియు తానా ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి, సామినేని ఫౌండేషన్ నిర్వాహకులు సామినేని నాగేశ్వరరావు గార్ల చేతుల మీదుగా ఇద్దరు వికలాంగులకు 1,60,000/- విలువైన మూడు చక్రాల స్కూటర్, నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్, అనాథ నిరుపేద విద్యార్థినికి 10,000/- ఆర్ధిక సహాయం అందచేసారు.
తానా ఫౌండేషన్ తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేదరమెట్ల స్వరూపారాణి, డి ఎన్ ఎఫ్ ప్రెసిడెంట్ బోనాల రామక్రిష్ణ, తానా ఫౌండేషన్ ఇండియా ట్రస్టీ పసుమర్తి రంగారావు, బండి నాగేశ్వరరావు, బి.సి.యూత్ రాకేశ్ దత్తా, విజయ భాస్కర్, ఆర్ ఎమ్ పి తదితరులు పాల్గొన్నారు.
లబ్దిదారులు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ చైర్మెన్ యార్లగడ్డ వెంకటరమణ, ట్రస్టీ సామినేని రవి మరియు దాతలకుకృతఙ్ఞతలు తెలియచేసారు.