Connect with us

Convention

ముచ్చటగా మూడోసారి Detroit లో తానా మహాసభలు, ప్రణాళిక కమిటీ ఏర్పాటు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 2025లో నిర్వహించే తానా 24వ మహాసభలకు వేదికగా డెట్రాయిట్ (Detroit) నగరాన్ని ఎంపిక చేయడంతోపాటు, ఈ మహాసభలకు కోఆర్డినేటర్ గా ఉదయ్ కుమార్ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu), చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ళ (Gangadhar Nadella) ను నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) గత వారం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

డెట్రాయిట్లో (Detroit) 2025, జూలైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్ కి రంగం సిద్ధమైంది. Novi Suburban Showplace లో జరిగే ఈ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ (Conference Planning Committee) ఏర్పాటు చేసినట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు.

తానా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (Detroit Telugu Association), శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ మరియు ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా లో పలు నాయకత్వ బాధ్యతలో పాటు, తానా 2005, 2015 సమావేశాలు, డిటిఎ 25వ, 40వ వార్షికోత్సవాలు సమర్ధవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న ఈ కమిటీ సభ్యులు, సెప్టెంబర్ 2024 చివరి నాటికి ప్రణాళిక నివేదికను అందిస్తుందన్నారు.

అలాగే అక్టోబర్ 19, 2024 న కిక్ఆఫ్ ఈవెంట్ (Conference Kickoff Event) ను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కు వాలంటీర్లుగా పనిచేయాలనుకునేవారు www.tanaconference.org ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చని కూడా ఆయన తెలిపారు.

కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ సభ్యులు

గంగాధర్ నాదెళ్ల: చైర్మన్, నిధుల సేకరణ
శ్రీనివాస్ కోనేరు (కెవికె): కో-కోఆర్డినేటర్, ఆర్ధిక & ఆదాయ విభాగాలు
సునీల్ పాంట్ర: కాన్ఫరెన్స్ డైరెక్టర్, సాంస్కృతిక & సాహిత్య కార్యక్రమాలు
కిరణ్ దుగ్గిరాల: కార్యదర్శి, ప్రణాళికా సమన్వయం
జోగేశ్వరరావు పెద్దిబోయిన: కోశాధికారి, వేదిక & హోటళ్లు & భోజన ఏర్పాట్లు
నీలిమ మన్నె: తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి – పోటీలు, అలంకరణలు, మహిళలు & పిల్లల కార్యకలాపాలు

తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురితో కూడిన కమిటి ఇచ్చిన నివేదికను బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి చైర్మన్ గా శ్రీనివాస్ కోనేరు వ్యవహరించారు. సభ్యులుగా నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి ఉన్నారు. 2025 జూలై మొదటివారంలో ఈ మహాసభలు డెట్రాయిట్ (Detroit) లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

ప్రతి పదేళ్ళకు ఓసారి డెట్రాయిట్ (Detroit) లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరంలో కూడా డెట్రాయిట్ లో తానా మహాసభలు జరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా 2025లో మహాసభలకు వేదికగా డెట్రాయిట్ నిలవడం విశేషం. డెట్రాయిట్ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిధులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తరువాత ఇసి, బోర్డ్ డెట్రాయిట్ (Detroit) ను ఎంపిక చేసినట్లు రాజా కసుకుర్తి తెలియజేశారు.

ఈ మహాసభల కో ఆర్డినేటర్ ఉదయకుమార్ చాపలమడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా లోని చల్లపల్లిలో జన్మించిన ఉదయ కుమార్ చాపలమడుగు తానాలో వివిధ కీలక పదవులను నిర్వహించారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న ఉదయ్ కుమార్ వచ్చే సంవత్సరం డెట్రాయిట్ లో జరిగే తానా 2025 మహాసభలకు కోఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) కార్యనిర్వాహక కమిటీలో అనేక పదవులను ఉదయ్ కుమార్ నిర్వహించారు. ముఖ్యంగా, బాగా గుర్తింపు పొందిన డిటిఎ 25వ మరియు 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్ గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డిట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్ గా కూడా ఆయన సేవలందించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ గా కూడా ఆయన పనిచేశారు.

ప్రముఖ నటుడు స్వర్గీయ శ్రీ తమ్మారెడ్డి చలపతి రావు గారి అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాల ద్వారా తెలుగు ప్రజలలో విశేషంగా గుర్తింపు పొందారు. జూలై 2025 లో మెట్రో డెట్రాయిట్ (Detroit) లో జరగబోయే తానా 24 వ ద్వైవార్షిక సదస్సుకు కోఆర్డినేటర్ గా ఆయనను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ తానా 2025 మహాసభలకు చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ళను కూడా నియమించారు. తానాలో పాతతరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్ నాదెళ్ళ ఈ మహాసభలను కూడా పర్యవేక్షించనున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected