Connect with us

Conference

డబ్బులు ఎవరికీ ఊరికే రావు! తానా సభల టికెట్స్ పై డిస్కౌంట్ మరో 4 రోజులు మాత్రమే

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ తానా 23వ మహాసభల టికెట్స్ కొరకు www.NRI2NRI.com/TANA23rdConference ని సందర్శించండి. టికెట్స్ పై డిస్కౌంట్ మరో 4 రోజులు మాత్రమే. అంటే జూన్ 9 తర్వాత డిస్కౌంట్ ఉండదు. కావున అందరూ త్వరగా డిస్కౌంట్ రేటులో జూన్ 9 లోపు టికెట్స్ కొనుక్కోవలసిందిగా తానా మహాసభల నిర్వాహకులు కోరుతున్నారు.

జూన్ 9 తర్వాత కూడా టికెట్స్ అమ్ముతారు. కాకపోతే డిస్కౌంట్ (Discount) ఉండదు. “డబ్బులు ఎవరికీ ఊరికే రావు” అంటూ లలితా జ్యువెలరీ పాపులర్ అడ్వర్టైజ్మెంట్ గుర్తుపెట్టుకొని త్వరగా జూన్ 9, ఈ శుక్రవారం లోపే డిస్కౌంట్ తో టికెట్స్ (Tickets/Registrations) కొనుక్కోండి.

ప్రతి టికెట్ కి తానా 23వ మహాసభల (TANA 23rd Conference) రెండు రోజులు జులై 8, 9 ఎంట్రీతోపాటు రెండు పూట్లా భోజనం, షాపింగ్ స్టాల్ల్స్, బ్రేకౌట్ సెషన్స్ (సాహిత్య, యువత, మహిళా, ఆధ్యాత్మిక, రాజకీయ సదస్సులు) మరియు ప్రధాన కార్యక్రమాలన్నిటికీ ప్రవేశం లభించును.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected