ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభలకు ప్రిపరేషన్ లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా క్రీడలకు కూడా పెద్ద పీట వేశారు. అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా నిర్వహించనున్న తానా మహాసభల క్రీడాకార్యక్రమాలకు శ్రీరామ్ ఆలోకం స్పోర్ట్స్ చైర్ గా, హరీష్ కూకట్ల మరియు చలం పావులూరి కోచైర్స్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుత 2021-23 తానా కార్యవర్గం టర్మ్ లో క్రీడలను కొత్తపుంతలు తొక్కించిన తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ కన్వెన్షన్ స్పోర్ట్స్ టీంకి పెద్ద ఎసెట్ అవ్వనున్నారు. ఇటు అమెరికా అటు ఇండియాలో పలు రకాల క్రీడలతో క్రీడాస్ఫూర్తిని ఇనుమడింపజేసిన శశాంక్ యార్లగడ్డ (#TANANexGen) కన్వెన్షన్ స్పోర్ట్స్ టీంతో కలిసి పనిచేయనున్నారు.
ఈ కన్వెన్షన్ స్పోర్ట్స్ లో తానా క్రికెట్ ప్రీమియర్ లీగ్, టెన్నిస్, వాలీబాల్, బాడ్మింటన్, పికెల్ బాల్, త్రోబాల్ వంటి పలు ఆహ్లాదకరమైన ఆటల పోటీలకు శ్రీకారం చుట్టారు. ప్రతి టౌర్నమెంట్లో ప్రధమ మరియు ద్వితీయ విజేతలకు ఆకర్షణీయమైన క్యాష్ బహుమతులు అందించనున్నారు.
మేజర్ లీగ్ మరియు మైనర్ లీగ్ అంటూ వాలీబాల్ లో రెండు క్యాటగిరీస్ లో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 40 జట్లకు పైగా ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ (Volleyball Tournaments) లో పాల్గొననుండడం క్రీడల స్థాయిని తెలియజేస్తుంది. దీంతో తానా క్రీడలలో నెక్స్ట్ జనరేషన్ (#TANANexGen) యువతను ప్రోత్సహించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టయింది.
కావున క్రీడాకారులందరూ త్వరగా రెజిస్ట్రేషన్ రుసుము చెల్లించి తమ తమ జట్లను రెజిస్టర్ చేసుకోవలసిందిగా కోరుతున్నారు తానా 23వ మహాసభల క్రీడల నిర్వాహకులు. మరిన్ని వివరాలకు ఫ్లయర్స్ చూడండి. మీకేమైనా సందేహాలు ఉంటే ఫ్లయర్స్ లో ఉన్న ఫోన్ నంబర్స్ ని సంప్రదించండి.