Connect with us

Fundraiser

తానా 23వ మహాసభలకు నగరాల వారీగా ఫండ్రైజర్, హారిస్బర్గ్ తో శ్రీకారం

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) 23వ మహాసభలు (TANA Convention) ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న విషయం అందరికీ విదితమే.

ఈ తానా మహాసభలు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన రవి పొట్లూరి కన్వీనర్ గా నిర్వహించనున్నారు. ఈ 23వ మహాసభలకు ఫండ్స్ రైజ్ చేసే పనిలో భాగంగా ఎప్పటిలానే నగరాల వారీగా ఫండ్రైజర్ నిర్వహించనున్నారు. దీనికి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హారిస్బర్గ్ నగరంతో శ్రీకారం చుట్టనున్నారు.

ఈ శనివారం ఫిబ్రవరి 18న హారిస్బర్గ్ లోని సిల్వర్ స్ప్రింగ్ బ్యాంక్వెట్ సెంటర్ లో నిర్వహించే ఈ ఫండ్రైజర్ & కిక్ ఆఫ్ కార్యక్రమానికి ఉదార స్వభావులు అందరూ కొంచెం సమయం కేటాయించుకుని హాజరై, ‘మేము సైతం ఈ మహత్కార్యానికి’ అంటూ మీ వంతు చేయూతనిచ్చి గొప్ప ఔన్నత్యాన్ని చాటుకుంటారు అని ఆశిస్తున్నారు 23వ తానా మహాసభల సమన్వయ కమిటీ వారు.

error: NRI2NRI.COM copyright content is protected