మార్చ్ 24న అట్లాంటాలోని లైఫ్ లైన్ తెలుగు చర్చిలో ఈస్టర్ ఎగ్ హంట్ జరిగింది. తామా సిలికానాంధ్ర మనబడి తరగతులు ఈ చర్చిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మనబడి విద్యార్ధులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, తానా సెక్రటరీ అంజయ్య చౌదరి లావు, తామా సభ్యులు వినయ్ మద్దినేని, వెంకట్ మీసాల, ఇన్నయ్య ఎనుముల, బిల్హన్ ఆలపాటి, భరత్ అవిర్నేని, ప్రసాద్ కుందేరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనబడి తరగతుల అనంతరం ఈస్టర్ ఎగ్ హంట్, అలాగే ఈస్టర్ కి సంబంధించి వీడియో ప్రదర్శన చేసారు. పిల్లలందరూ ఎగ్ హంట్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చర్చి వారు ప్రాంగణములో దాచిన కాన్డీస్ తో నింపబడిన ఈస్టర్ ఎగ్స్ ను పిల్లలు వెతికి సేకరించడం సరదాగా సాగింది. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమ నిర్వహణకు లైఫ్ లైన్ చర్చి పాస్టర్ సంజీవ్ కటికాల కృషి చేయగా సుసాన్ పుల్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చివరిగా స్నాక్స్ తో కార్యక్రమం ముగిసింది.