36 సంవత్సరాల చరిత్ర కలిగిన అట్లాంటా తెలుగు సంఘం (తామా – తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా 2018 కి గాను అందునా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అట్లాంటా వాసులందరికి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసారు వెంకీ గద్దె. మైకు దొరికితే మహిళా సాధికారత గురించి అదే పనిగా ఊకదంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టే ఈరోజుల్లో తామా కార్యవర్గం గత సర్వ సభ్య సమావేశాల్లో మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యదర్శి పదవిని ప్రతిపాదించడం అలాగే సభ్యులందరూ ఆమోదించడం తామా కార్యదక్షతకు నిలువెత్తు నిదర్శనం మరియు అట్లాంటా చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు. ఈ పదవికి మొట్టమొదటి ఉమెన్స్ సర్వీసెస్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రావణి రాచకుల్ల గారికి, అదే సర్వ సభ్య సమావేశాల్లో తామా ఉచిత వైద్యశాల మరియు సీనియర్ సిటిజన్స్ సర్వీసెస్ కొరకు కొత్తగా ఆమోదించబడిన కమ్యూనిటీ సర్వీసెస్ సెక్రటరి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన నగేష్ దొడ్డాక గారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తామా చరిత్రలో చిట్టచివరి వైస్ ప్రెసిడెంట్ మరియు కాబోయే ప్రెసిడెంట్ మిత్రుడు మనోజ్ తాటికొండ, మిగతా 2018 కార్యవర్గ మిత్రులు భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, రాజేష్ తడికమళ్ల, బిల్హన్ ఆలపాటి, సాయిరాం కారుమంచి, భరత్ అవిర్నేని, రవి కల్లి, రమేష్ వెన్నెలకంటి, బోర్డు సభ్యులు దేవానంద్ కొండూర్, రాజశేఖర్ చుండూరి, శ్రీ హర్ష యెర్నేని, విజు చిలువేరు, మరియు వినయ్ మద్దినేని గార్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.