Connect with us

News

ఉల్లాసంగా తామా Pickleball Tournament @ North Park, Alpharetta, Georgia

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) వారు క్రీడా స్ఫూర్తి తో పికెల్ బాల్ టౌర్నమెంట్స్ ఏప్రిల్ 19న, శనివారం రోజున అల్ఫారెటా (Alpharetta) లోని నార్త్ పార్క్ (North Park) లో నిర్వహించారు. దీనికి చాలా మంది యువతీయువకులు నమోదు చేసుకొని పికెల్ బాల్ ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మొదట తామా అధ్యక్షులు రూపేందర్ వేములపల్లి (Rupendra Vemulapalli) మరియు క్రీడల సమన్వయకర్త సురేష్ యాదగిరి (Suresh Yadagiri) ఆటల పోటీలకు వచ్చిన క్రీడాకారులందరినీ అభినందించి, ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఎంతో అవసరమని, మనలను మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంచుతాయని చెప్పారు. రోజూ కొంత సమయం వ్యాయామానికి, ఆటలకు కేటాయించాలని చెప్పి పోటీలని ప్రారంభించారు.

పోటీలకు పిన్నలు, పెద్దలూ అందరూ మొత్తం 70 మంది పైగా నమోదు చేసుకొన్నారు. ఈ పికెల్ బాల్ (Pickleball Tournament) ఆటల పోటీలను 8 క్రీడా ఆవరణాలలో నిర్వహించారు. ఈ పోటీలలో వచ్చిన క్రీడా కారులను మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ ప్రాతిపదికన విభజించి నిర్వయించారు.

దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ పోటీలలో ఎంతోమంది తమ ప్రతిభని ప్రదర్శించి హోరాహోరీగా తలపడ్డారు. అన్ని విభాగాలలో ఉత్తమ నైపుణ్యం కనబరచి, గెలుపొందిన వారికి తామా (TAMA) వారు బహుమతులను అందజేయడం జరిగింది. మొదటి, రెండవ & మూడవ విజేతలకు వరుసగా $100, $50, & $25 వీసా (Visa) గిఫ్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది.

ఈ తామా పికెల్ బాల్ (Pickleball Tournament) ఆటల పోటీలలో పాల్గొన్న అందరూ ఈ ఆటల పోటీలను నిర్వహించినందులకు తామా వారిని ఎంతగానో అభినందించారు. ఆటలాడి అలిసిపోయిన అందరికి తామా (TAMA) వారు ఉచిత పండ్లు, ఫలహారం, నీరు, శీతల పానీయాలు కూడా అందించారు.

ఆరుబయట ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగిన పికెల్ బాల్ (Pickleball Tournament) ఆటల పోటీలలో తామా అధ్యక్షులు: రూపేందర్ వేములపల్లి, క్రీడల కార్యదర్శి: సురేష్ యాదగిరి, సునీత పొట్నూరు (ప్రెసిడెంట్ ఎలెక్ట్), ప్రధాన కార్యదర్శి: తిరుమల రావు చిల్లపల్లి, కోశాధికారి: సునీల్ దేవరపల్లి, సాంకేతిక కార్యదర్శి: చలమయ్య బచ్చు, సాహిత్య కార్యదర్శి: శ్రీనివాస్ రామనాధం, విద్యా కార్యదర్శి: ముఖర్జీ వేములపల్లి, కమ్యూనిటీ కార్యదర్శి: కృష్ణ ఇనపకుతిక, ఈవెంట్స్ కార్యదర్శి: శేఖర్ కొల్లు, బోర్డు చైర్మన్: రాఘవ తడవర్తి, బోర్డు సభ్యులు: సాయిరాం కారుమంచి, యశ్వంత్ జొన్నలగడ్డ & క్రీడాకారులు, సంస్థ శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.

విజేతల వివరాలు

Women’s Doubles

Wildbrooke Vibrants – Sudeepthi Victor & Pallavi Panthri
Chaitra Shetty & Lahari
Aakriti Yadav & Rishita

Mixed Doubles

Naomi-Vishwa – Vishwa Rajan & Naomi Thakkar
Wildbrooke Vibrants – Sudeepthi Victor & Vinayak Rao
Wildbrooke Maniacs – Shekshavali Mulla & Pallavi Panthri

Men’s Doubles

Lakshmi Narayana Iruku & Vamsidhar Attaluri
Shekshavali Mulla & Vinayak Rao
Gobinath Narayanasamy & Manjunath Benal

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
error: NRI2NRI.COM copyright content is protected