Connect with us

Health

అద్వితీయ సామాజిక సేవలకు TAMA Free Clinic డాక్టర్స్ కి సత్కారం @ Johns Creek, Georgia

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Georgia Department of Public Health) అప్రూవల్ అండ్ లయబిలిటీతో గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్ (TAMA Free Clinic) లో సహాయ సహకారాలు అందిస్తున్న వైద్యులకు ఫిబ్రవరి 15న వారిని అభినందిస్తూ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా తామా (Telugu Association of Metro Atlanta – TAMA) బోర్డు చైర్మన్ రాఘవ తడవర్తి, కమ్యూనిటీ సర్వీసెస్ సెక్రెటరీ కృష్ణ ఇనపకుతిక, సమన్వయ కర్త నగేష్ దొడ్డాక.. తామా ఉచిత క్లినిక్ చేసే సామాజిక సేవలను (Social Service) సభికులకు వివరించి తరువాత వైద్యులను, ముఖ్య అతిధులను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) ద్వారాఇప్పటి వరకూ దాదాపు 12 వేలమంది పరిమిత ఆరోగ్య భీమా లేదా భీమా లేని వారు, విద్యార్థులు, విజిటింగ్ పేరెంట్స్ లబ్ధి పొందారు. వందల మంది వాలంటీర్లు, పదుల సంఖ్యలో డాక్టర్ల నిర్విరామకృషితోనే ఇదంతా సాధ్యమైనదనీ వివరించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జార్జియా స్టేట్ రిప్రజంటేటివ్ టాడ్ జోన్స్ (Todd Jones) మరియు ఫోర్ సైత్ కౌంటీ బోర్డు ఆఫ్ కమీషనర్ లారా సెమాన్సన్ (Laura Semanson) హాజరయ్యారు. టాడ్ జోన్స్ (Todd Jones) మాట్లాడుతూ… తామా వారు నిర్వహించే ఉచిత వైద్య సహాయం చాలా మంచిదని, ఈ సేవ ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వడం రాబోయేతరాలకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు.

లారా సెమాన్సన్ (Laura Semanson) మాట్లాడుతూ… తామా తనకు చాలాసంవత్సరాలుగా తెలుసుననీ కానీ ఉచిత వైద్య సహాయం గురించి ఈ మధ్యనే తెలిసిందనీ, వైద్యులుచేస్తున్న ఈ సేవ గొప్పదని, వైద్య భీమా లేనివారికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. తామా బోర్డు వారు ముఖ్య అతిధులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, హస్త కళల ద్వారాచేయించిన ఏనుగు బొమ్మలను ఇచ్చి సత్కరించారు.

చివరగా లావు బ్రదర్స్ (అంజయ్య చౌదరి లావు & శ్రీనివాస్ లావు) మాట్లాడుతూ… తామా (Telugu Association of Metro Atlanta) వారు ఉచిత వైద్య శిబిరంకు యంత్రం వంటి వారైతే వైద్యులు ఇంధనం లాంటి వారని, రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ సహాయ సౌకర్యాలు అవసరమౌతాయని, ఇందుకుగాను ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఆహ్వానితులుగా వచ్చిన వైద్యులందరికీ ముఖ్య అతిధుల చేతుల మీదుగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, మొమెంటో ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయని కుమారి అక్షిత జగదీశన్ & జయని కారుమంచి చలన చిత్ర గీతాలు ఆలపించారు. సునీత పొట్నూరు, ప్రియ బలుసు, ప్రియాంక గడ్డం వచ్చిన వైద్యులతో, వారి కుటుంబసభ్యులతో సరదాగా ఆటలు ఆడించారు.

ఫోటోగ్రాఫర్స్ పృథ్వీ, కార్తీక్ కొండూరి, డిజే కమల్ సాతులూరు, అక్షిత, ఆచీస్ రెస్టారెంట్ (Aachi’s Restaurant) టీమ్ & రాజు కి తామా వారు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది. చివర్లో సాయిరాం కారుమంచి మరియు నగేష్ దొడ్డాక సరదాగా పాటలు పాడి వచ్చిన వారిని ఆనంద పరిచారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు రాఘవ తడవర్తి, రూపేంద్ర వేములపల్లి, చలమయ్య బచ్చు, సుధా ప్రియాంక సుందర, శేఖర్ కొల్లు, రవి కల్లి, ప్రియ బలుసు, తిరుమలరావు చిల్లపల్లి, సునీత పొట్నూరు, శ్రీనివాసరావు రామనాధం, యశ్వంత్ జొన్నలగడ్డ, కృష్ణ ఇనపకుతిక, సురేష్ యాదగిరి, నగేష్ దొడ్డాక, సాయిరాం కారుమంచి, శ్రీనివాసులు రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, సురేష్ బండారు పాల్గొన్నారు.

ఈ ఉచిత క్లినిక్ (TAMA Free Clinic) ని విజయవంతంగా నడుపుతున్నందుకు డాక్టర్లందరూ తామా (Telugu Association of Metro Atlanta – TAMA) ను మరియు వాలంటీర్లను (Volunteers) అభినందించారు. అలాగే ఇందులో భాగమైనందుకు వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected