Connect with us

Health

TAMA Free Clinic డాక్టర్స్ & వాలంటీర్స్ ని అభినందిస్తూ అప్ప్రీసియేషన్ డిన్నర్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య, విద్య, సేవాకార్యక్రమాలు ఒక ఎత్తైతే, తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) మరొక ఎత్తు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Georgia Department of Public Health – GADPH) అప్రూవల్ అండ్ లయబిలిటీతో నిర్వహిస్తున్న ఈ ఉచిత క్లినిక్ కి మూలస్తంభాలు డాక్టర్స్ మరియు వాలంటీర్స్.

అందుకే తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) లో సహాయసహకారాలందింస్తున్న డాక్టర్స్ మరియు వాలంటీర్స్ (Doctors & Volunteers) ని అభినందిస్తూ అప్ప్రీసియేషన్ డిన్నర్ ఏర్పాటుచేశారు. గత ఫిబ్రవరి 18 వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెర్సిస్ బిర్యానీ ఇండియన్ గ్రిల్ (Persis Biryani Indian Grill) రెస్టారెంట్ వేదికైంది.

ఈ అప్ప్రీసియేషన్ డిన్నర్ కార్యక్రమానికి పలువురు డాక్టర్లు, వాలంటీర్లు, తామా (Telugu Association of Metro Atlanta – TAMA) కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు హాజరయ్యారు. ముందుగా తామా అధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru), క్లినిక్ షెడ్యూల్ సమన్వయకర్త మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నగేష్ దొడ్డాక (Nagesh Doddaka) అందరికీ ఆహ్వానం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తదనంతరం డాక్టర్స్ అందరినీ కుటుంబసమేతంగా శాలువా మరియు పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్స్ మాట్లాడుతూ… 43 సంవత్సరాల అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఈ ఉచిత క్లినిక్ (TAMA Free Clinic) ని 2012 లో ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు.

అంతే కాకుండా ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా కొనసాగించడాన్ని, ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చేసిన సహాయాన్ని అభినందించారు. ముఖ్యంగా ఇండియా (India) నుంచి తమ పిల్లలను చూద్దామని వచ్చే తల్లితండ్రులకు తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) ఒక సంజీవని లాంటిదని అన్నారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిన్నర్ అనంతరం తామా నాయకులు (TAMA Leaders) పలువురు వాలంటీర్స్ ని అభినందించారు. ఇంకా వాలంటీర్స్ (Volunteers) మరియు డాక్టర్స్ కావాలని, తెలిసినవారు లేదా ఇంట్రెస్ట్ ఉన్నవారు తామా కార్యవర్గ సభ్యులను సంప్రదించవలసిందిగా కోరారు.

స్థానిక గాయకురాలు పావని తన పాటలతో కాసేపు అలరించింది. అందరూ సందడిగా ఫోటోలు దిగారు. చివరిగా వందన సమర్పణతో ఈ తామా ఫ్రీ క్లినిక్ డాక్టర్స్ మరియు వాలంటీర్స్ అప్ప్రీసియేషన్ డిన్నర్ (Appreciation Dinner) విజయవంతంగా ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected