Connect with us

Health

ఆరోగ్యానందలహరి TAMA ఫ్రీ క్లినిక్ 5కె వాక్ విజయవంతం @ Johns Creek, Atlanta

Published

on

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఫ్రీ క్లినిక్ 5కె వాక్ ఆరోగ్యం + ఆనందం = ఆరోగ్యానందలహరి అనేలా విజయవంతంగా ముగిసింది. అట్లాంటా (Atlanta) లో గత వారాంతం తామా ఉచిత క్లినిక్ (TAMA Free Clinic) అవగాహన మరియు విరాళాల సేకరణ కోసం నిర్వహించిన వార్షిక 5కె వాక్ (5K Walk) లో దాదాపు 600 మంది పాల్గొన్నారు.

తామా బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ ఉప్పు లీడర్షిప్ లో ఇంతకు ముందు సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రవాసులు ఈ సంవత్సరం 5కె వాక్ లో పాల్గొనడం విశేషం. పెద్దలు, చిన్నారులు, యువత, సీనియర్లు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా చేశారు.

జులై 27 శనివారం రోజున తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు జాన్స్ క్రీక్ (Johns Creek) లోని కాలి క్రీక్ పార్క్ (Cauley Creek Park) లో ఉదయం 7 గంటల నుండే ఏర్పాట్లు చేశారు. రెజిస్ట్రేషన్ డెస్క్ వద్ద టీషిర్ట్స్, బిబ్స్ తీసుకొని వార్మ్ అప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ టీషిర్ట్స్ బాగున్నాయని కితాబివ్వడం విశేషం.

ముందుగా ఛైర్మన్ శ్రీనివాస్ ఉప్పు (Srinivas Uppu) సారధ్యంలో తామా బోర్డు సభ్యులు మరియు అధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru) సారధ్యంలో తామా కార్యవర్గసభ్యులు అందరికీ స్వాగతం పలికారు. అనంతరం అందరూ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఆరంజ్ ఆర్చి దగ్గిరకు రాగా సుమారు 8 గంటలకు తామా నాయకులు 5కె వాక్ (5K Walk) ని ప్రారంభించారు.

వాకర్స్ వడివడిగా నడుస్తూ, కలివిడిగా మాట్లాడుకుంటూ, వాలంటీర్లు అందించే మంచినీళ్లు తాగుతూ, ఫోటోలు తీసుకుంటూ హుషారుగా ముందుకు సాగారు. వేసవి సెలవుల అనంతరం ఇప్పుడిప్పుడే బడులకు వెళ్ళబోతున్న చిన్నారులకు, తీరిక లేకుండా ఉన్న తల్లిదండ్రులకు సేదదీరేందుకు ఈ వాక్ ఉపయోగపడింది అనడంలో అతిశయోక్తి లేదు.

వాక్ అనంతరం స్పైసీ దేశి అట్లాంటా ఫుడ్ ట్రక్ (Spicy Desi Atlanta Food Truck) వారు అందించిన వేడి వేడి టిఫిన్, టీ కాఫీలు అలసటని మైమరపించాయి. తదనంతరం తామా (Telugu Association of Metro Atlanta) నాయకులు విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి నగేష్ దొడ్డాక (Nagesh Doddaka) వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫోర్సైత్ కౌంటీ కమీషనర్ టాడ్ లెవెంట్ (Todd Levent, Forsyth County Commissioner) మాట్లాడుతూ… తక్కువ లేక అస్సలు ఆరోగ్య భీమా లేనివారు, విజిటింగ్ పేరెంట్స్, స్టూడెంట్సే తదిరులకు ఉపయోగపడేలా నిర్వహిస్తున్న తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) సేవలను, తామా నాయకులను కొనియాడారు.

ఈ సందర్భంగా తామా (TAMA) ఛైర్మన్ శ్రీనివాస్ ఉప్పు, తామా అధ్యక్షులు సురేష్ బండారు మరియు అట్లాంటా (Atlanta) పెద్దలు 5కె వాక్ స్పాన్సర్స్ ని శాలువా మరియు మెమెంటోతో ఘనంగా సత్కరించారు. తానా, ఆటా, నాటా, టిటిఎ, టీడీఫ్, ఎన్నారై విఎ, ఆప్త, గేట్స్ వంటి ఇతర సంస్థల ప్రతినిధులు కూడా ఈ 5కె వాక్ లో పాల్గొనడం అభినందనీయం.

తామా కి ఎప్పటి నుంచో డాక్టర్ గా ఉచిత సేవలందిస్తున్న డా. నందిని సుంకిరెడ్డి (Dr. Nandini Sunkireddy) కొత్తగా మొదలుపెట్టిన ఎస్పైర్ మెడికల్ గ్రూప్ (Aspire Medical Group) హాస్పిటల్ వెబ్సైట్ ని వాకర్స్ సమక్షంలో ప్రారంభించారు. అపాయింట్మెంట్స్ కోసం తమని సంప్రదించవచ్చని డా. నందిని తెలియజేశారు.

చివరిగా తామా (TAMA) ప్రెసిడెంట్ ఎలెక్ట్ రుపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) తామా ఫ్రీ క్లినిక్ 5కె వాక్ విజయవంతానికి కృషి చేసిన వాలంటీర్స్, స్పాన్సర్స్, డాక్టర్స్, వాకర్స్, మీడియా, కాలి క్రీక్ పార్క్ నిర్వాహకులు, స్పైసీ దేశి అట్లాంటా ఫుడ్ ట్రక్ తదితరులకు ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) కి సంబంధించి మరిన్ని వివరాలకు www.tama.org ని సందర్శించండి లేక [email protected] కి ఇమెయిల్ పంపండి. అలాగే తామా ఫ్రీ క్లినిక్ 5కె వాక్ కి సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TAMA Free Clinic 5K Walk 2024 ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected