Connect with us

Health

ఆరోగ్యం + ఆహ్లాదం = తామా ఫ్రీ క్లినిక్ 5కె వాక్

Published

on

ఆగస్టు 1 న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు జాన్స్ క్రీక్ లోని న్యూటౌన్ పార్క్ లో నిర్వహించిన 5కె వాక్ ఆహ్లాదకరంగా జరిగింది. తామా ఫ్రీ క్లినిక్ నిధుల సేకరణ కోసం మరియు సమాజంలో అవగాహన కోసం ప్రత్యేక వార్షిక కార్యక్రమంగా ఈ 5కె వాక్ ని నిర్వహించారు. ప్రొదున్నే 6.30 నుండి మొదలయిన వలంటీర్ల సందడితో న్యూటౌన్ పార్క్ నిద్రలేచింది. వాక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆరంజ్ ఆర్చి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. పార్క్ అంతా స్పాన్సర్స్ బానర్స్, రిజిస్ట్రేషన్ బూత్స్, స్టాల్ల్స్, బ్రేక్ ఫాస్ట్ స్టాల్, డీజే స్టేషన్ తో కళ కళ లాడింది.

సుమారు 8 గంటలకు  కాంటినెంటల్ స్నాక్స్, ఫ్రూట్స్, కాఫీలతో రెజిస్ట్రేషన్స్ మరియు త్రిపుర గారి జుంబా వ్యాయామం తో సందడి మొదలయింది. పాల్గొన్న అందరికి, ప్రత్యేక టీషిర్ట్స్, బిబ్స్, మెడల్ మరియు మాక్సియం వారి జూట్ బాగ్స్ అందచేశారు.  సుమారు 9 గంటలకు తామా చైర్మన్ కమల్ సాతులూరు గారు తమ సందేశంతో అందరిని ఉత్తేజ పరిచి వాక్ ని ప్రారంభించారు. ఈ సందర్భంలో తామా ప్రెసిడెంట్ ఇన్నయ్య యెనుముల గారు, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారు, ఐఎసిఎ ప్రెసిడెంట్ చాంద్ అక్కినేని గారు, నరేందర్ రెడ్డి గారు మరియు స్పాన్సర్స్ శ్రీనివాస్ లావు గారు, భరత్ మద్దినేని గారు, డాక్టర్ వెంకట్ చలసాని గారు మరియు అనేకమంది ప్రారంభ వేడుకలో పాల్గొని తమ సందేశం అందచేశారు. వారితో పాటు తామా క్లినిక్ కోసం తమ  విలువయిన సమయాన్ని, సహకారాన్ని అందిస్తున్న డాక్టర్స్ డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారు, డాక్టర్ ప్రవీణ్ గుడిపాటి గారు, డాక్టర్ వెంకట్ చలసాని గారు, డాక్టర్ మాధవి సిద్ధాంతి గారు, డాక్టర్ నాగ కొమ్మూరి గారు మాట్లాడి వాక్ లో పాల్గొని అందరికి ప్రోత్సాహమిచ్చారు. సుమారు 300 మంది రిజిస్టర్ చేసుకున్న కార్యక్రమం లో పాండెమిక్ అయినా సుమారు 200 మంది పాల్గొని వాక్ ని జయప్రదం చేశారు.

వాక్ అనంతరం అందరూ తామా వారు అందించిన చక్కని ఇండియన్ బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ లు ఆస్వాదిస్తూ అవార్డ్ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయమందించిన వాలంటీర్లు సుప్రజా సాతులూరు, స్నేహ శర్మ, రిత్విక్ నాగభైరవ, అనిక రొయ్యల, ప్రణవ్ దోనెటీనేని, పూజిత దోనెటీనేని, లక్ష్మీ జోజ్జవరపు, నికిత నీలి లకు జాన్స్ క్రీక్ సార్జెంట్స్ సర్టిఫికెట్స్ అందించారు. వాక్ లో మొదటి మూడు స్థానాల్లో వచ్చిన పిల్లలకు మరియూ పెద్దలకు తామా వారు బహుమతులిచ్చి సత్కరించారు. 5కె వాక్ పూర్తి చేసిన సీనియర్ సిటిజన్ శ్రీ సుబ్రమణ్యం దుర్వాసుల గారిని గుర్తించి మెడల్ తో సత్కరించారు. ఈ సందర్భం లో తామా చైర్మన్ కమల్ సాతులూరు మాట్లాడుతూ దాత లందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం చేయూత నిచ్చిన ముఖ్యమయిన దాతలను, మరియూ డాక్టర్స్ ని  క్లినిక్ కోఆర్డినేటర్ నగేష్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సహాయాన్ని అందించిన డీజే టిల్లు గారు, నవీన్ గారు, వాక్ లో సహకరించిన రాజేష్ జంపాల గారు, రామ్ మద్ది గారు, భరత్ అవిర్నేని గారు, నమ్రత సాతులూరు గార్లకి ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు. తామా కార్యవర్గం అంతా సమర్ధవంతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. 

ఈ కార్యక్రమానికి సహాయమందించిన స్పాన్సర్స్ వివరాలు క్రింద చూడవచ్చు.

Signature Sponsors

Sri. Ramu Venigandla garu (Eficens Systems)

Elite Sponsors

Sri. Nagesh Kasam garu (Amrutha Aurveda)
Sri. Madhav Durbha garu
Sri. Ramesh Maturu garu (Pyramid Consulting)
Dr. Venkat Chalasani garu (Parsons Pointe Dental Care)
Dr. Praveen garu (Cumming Dental)
Sri. Srinivas Lavu garu (Delta Information Systems)
Sri. Bharat Maddineni garu (Maxeom Inc)
Sri. Kiran Pasam garu (SplashBI)
Sri. Upendra Rachupally garu (Wissen)
Sri. RanaKumar Nadella garu (TANA)
Sri. Karunakar Asireddy garu (IST)
Sri. Sudhakar Boddu garu

Patron Sponsors

Sri. Sreedhar Doddapaneni garu
Dr. Nagendra Srinivas Kodali garu
Sri. Mallik Medarametla garu
Sri. Bilhan Alapati garu
Sri. Raju Mandapati garu
Smt. Malathi Nagabhirava garu
Sri. Arun Vuyyuru garu
Sri. Ravi Devulapalli garu
Sri. Viju Chiluveru garu
Sri. Ravi Kandimalla garu
Sri. Ravi Chander garu

Sri. Kamal Satuluru garu
Sri. Madhu Yarlagadda garu
Sri. Srinivas Uppu garu
Sri. Vijay Kotthapalli garu
Sri. Innaiah Yenumula garu
Sri. Srini Cherukumilli garu

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected