Connect with us

Cultural

TAMA @ Atlanta: తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ పద్దతిలో ఘనంగా దసరా & బతుకమ్మ వేడుకలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) వారు ప్రతిష్టాత్మకంగా దసరా, బతుకమ్మ వేడుకలు మరియు మహిళా సంబరాలను 21 సెప్టెంబర్ 2025, ఆదివారం నాడు దులూత్ నగరంలో జేడ్ బ్యాంకెట్ హాల్ (Jade Banquet Hall) లో చాలా సంతోషంగా, అంగరంగ వైభవంగా జరిపారు.

సాంప్రదాయ పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల్లో ప్రవాస భారతీయులైన, తెలుగు రాష్ట్రాల మహిళలు (Telugu States Women) పెద్దఎత్తున పాల్గొన్నారు. మొదటగా మహిళలు భక్తిశ్రద్దలతో, స్తానికంగా దొరికే పూలతో ౩౦ కి పైగా బతుకమ్మలను అద్భుతంగా అలంకరించి తీసుకొచ్చారు.

బతుకమ్మలన్నిటినీ ఒకదగ్గర చేర్చి, చుట్టూ తిరుగుతూ, భక్తి పాటలు పాడుతూ, బతుకమ్మను (Bathukamma) కొలిచారు. పిన్నలు, పెద్దలూ అందరూ వివిధ రంగుల వస్త్రాలు ధరించి ఆటపాటలలో తిరుగాడడం చూడముచ్చటగా ఉండింది. పూల పరిమళాలతో, బతుకమ్మ పాటల స్వలహరిలో ప్రాంగణం నిండిపోయింది.

ఈ వేడుకల్లో భాగంగా మహిళలు కోలాటం, జానపద నృత్యం, గౌరీ మరియు జమ్మి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి మహిళామణులు, చిన్నారులు చక్కగా ముస్తాబయ్యి, పలురకాల ఆకులతో, పువ్వులతో ప్రకృతి సిద్ధంగా అందమైన బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్దలతో పూజించారు.

అనంతరం ఆడబడుచులందరూ కోలాటం ఆడుతూ బతుకమ్మలని నిమజ్జనం గావించారు. తెలంగాణాలో పూల పండుగగా పేరు పొందిన బతుకమ్మ వేడుకలు అదే ఉత్సాహం తో అట్లాంటా (Atlanta, Georgia) మహానగరంలో జరగడం గర్వకారణం. బతుకమ్మ సంబరాలలో భాగంగా సునీత పొట్నూరు గారు మరియు పార్వతి కొంపెల్ల (Parvati Kompella) గారు బతుకమ్మ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ వేడుకలకు యాంకర్ గా ప్రియా మాధవ్ (Priya Madhav) ఆద్యంతం ఉల్లాసంగా వచ్చిన వారందరినీ ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని నడిపించారు. దసరా (Dussehra) సందర్భంగా అట్లాంటా (Atlanta) లోని స్థానిక కళాకారులు నృత్యాలు, సంగీతం & ఆట పాటలతో ప్రేక్షకులని మైమరమించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంబరాలని కూడా నిర్వహించారు. బాలికల, స్త్రీల దసరా వేషాలు, వస్త్రధారణ పోటీలు కూడా నిర్వహించారు. చాలామంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఈ మహిళా సంబరాల్లోని భాగంగా “శ్రీమతి తామా మహారాణి” కేటగిరీ కింద మహిళలకు అందాల పోటీలు (Beauty Contest) నిర్వహించారు.

శ్రీమతి తామా మహారాణి పోటీలలో గెలిచిన ముగ్గురు “శ్రీమతి’ ని ‘తామా-2025” మహారాణులుగా ప్రకటించారు. ఈ పోటీల్లో విజేతలు: సౌమ్య పందిరి, ఆమని & మాధురి. సునీత పొట్నూరు (Suneetha Potnuru) ఆధ్వర్యంలో వంటల పోటీలు జరిపి విజేతని “తామా మాస్టర్ చెఫ్” అని మెచ్చుకొన్నారు.

తామా మహారాణి పోటీలకు దాతలుగా ముందుకొచ్చిన తనిష్క్, జేడ్ బ్యాంకెట్ హాల్ మరియు హాష్ టాగ్ రెస్టారెంట్ (Hashtag Restaurant) లను తామా వారు మెచ్చుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఆర్ధిక సహాయంతో ముందుకు వచ్చిన దాతలు అభినందనీయులు. తామా (TAMA) వారు స్పాన్సర్స్ ని ఘనంగా సన్మానించారు.

వివిధ రకాల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీవల్లి శ్రీధర్ (Srivalli Sridhar), లావణ్య, ప్రియా దోషి, నిషా జీ (తనిష్క్), దీప్తి తాళ్లూరి & రేష్మ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన షాపింగ్ స్టాల్ల్స్ (Shopping Stalls) చుట్టూ అందరూ తిరుగుతూ వారికి కావలసినవి ఖరీదు చేశారు.

ఈ కార్యక్రమానికి సునీత పొట్నూరు (ప్రెసిడెంట్ ఎలెక్ట్), పార్వతి కొంపెల్ల (మహిళా కార్యదర్శి) అధ్యక్షత వహించారు. ప్రియా బలుసు (Priya Balusu) కూడా తన వంతు సహాయం చేశారు. వారి అంకిత భావం, కృషి ఈ వేడుక విజయ వంతంగా జరగడానికి దోహదపడింది. ఈ అద్భుతమైన వేడుక తెలుగు రాష్ట్రాల ఐక్యతని, భక్తి & గొప్ప సంసృతిని ప్రదర్శించింది.

తామా (Telugu Association of Metro Atlanta – TAMA) అధ్యక్షులు: రుపేంద్ర వేములపల్లి, విద్యా కార్యదర్శి: ముఖర్జీ వేములపల్లి, కోశాధికారి: సునీల్ దేవరపల్లి, బోర్డు పూర్వ సభ్యులు: శ్రీనివాస్ ఉప్పు, దాదాపు 500 కి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వాలంటీర్లను, ఫోటోగ్రాఫర్: Prudhvi Konduri, DJ: నారాయణ పల్లా, స్టేజి డెకరేషన్: AG డెకార్, రుచికరమైన భోజనాన్ని అందజేసిన హాష్ టాగ్ రెస్టారెంట్ ను, స్పాన్సర్స్ ను, ప్రేక్షకులను అందరినీ తామా (Telugu Association of Metro Atlanta – TAMA) వారు అభినందించారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అట్లాంటాలో తామా గౌరవంగా నిలబడి సమాజసేవలోనూ అగ్రగామిగా ఉంది. తామా ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలని కూడా నిర్వహిస్తోంది. ఉదాహరణకు ప్రతి వారం ఉచిత వైద్యం (TAMA Free Clinic), లాబరేటరీ పరీక్షలు వగైరా. మరిన్ని వివరాలకు తామా వారి వెబ్ సైట్ www.tama.org ని సంప్రదించండి.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దసరా, బతుకమ్మ వేడుకలు మరియు మహిళా సంబరాల మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TAMA Dasara Bathukamma 2025 ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected