Connect with us

Events

అక్టోబర్ 15న తామా దసరా & బతుకమ్మ వేడుకలు: Telugu Association of Metro Atlanta

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు అక్టోబర్ 15 ఆదివారం రోజున దసరా & బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా లోని స్థానిక దేశానా మిడిల్ స్కూల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్న ఈ సంబరాలకు ప్రవేశం ఉచితం.

బతుకమ్మ పోటీలు, దసరా వేషాలు డ్రెస్ కాంపిటీషన్, బహుమతులు, బతుకమ్మ ఆటపాట, కోలాటం, బతుకమ్మ నిమజ్జనం, షాపింగ్ స్టాల్ల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. అలాగే పండుగ ప్రత్యేక భోజనం కాంప్లిమెంటరీ. శ్రావణి మరియు సుజి వ్యాఖ్యాతలుగా అలరించనున్నారు.

అందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడం కోసం రెజిస్ట్రేషన్ తప్పనిసరి. అన్ని రకాల రెజిస్ట్రేషన్స్ కొరకు www.NRI2NRI.com/TAMA Dasara Bathukamma 2023 ని సందర్శించండి. అలాగే మరిన్ని వివరాలకు పైనున్న ఫ్లయర్ ని చూడండి.

error: NRI2NRI.COM copyright content is protected