అట్లాంటా తెలుగు సంఘం (TAMA) ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం, మార్చి 22, 2026న ఆల్ఫారెటాలోని ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) ప్రాంగణంలో అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. ఈ క్రీడా కార్యక్రమంలో 100కు పైగా ప్లేయర్స్ పాల్గొన్నారు.
ఈ బ్యాడ్మింటన్ (Sports) టోర్నమెంట్‌లో పెద్దలు, పిల్లలు, యువత సహా వివిధ వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం రోజంతా సాగిన ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు సాగాయి. పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించారు.
పురుషుల, మహిళల, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా ప్రతి మ్యాచ్‌లోనూ క్రీడాస్ఫూర్తి, పోటీ తత్వం స్పష్టంగా కనిపించింది. కుటుంబ సమేతంగా పాల్గొన్న సభ్యులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (Badminton Tournament) కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగా మార్చారు.
ఈ సందర్భంగా తామా అధ్యక్షురాలు సునీత పొట్నూరు (Suneetha Potnuru) మాట్లాడుతూ, “క్రీడలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సమాజాన్ని కలుపుకునే ఒక శక్తివంతమైన వేదిక. ఈ టోర్నమెంట్ ద్వారా తెలుగు కమ్యూనిటీ మధ్య అనుబంధం మరింత బలపడింది” అని తెలిపారు.
తామా స్పోర్ట్స్ & యూత్ సెక్రటరీ హరికృష్ణ అద్దంకి (Harikrishna Addanki) మాట్లాడుతూ, “ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో పాల్గొన్న ప్రతి ఆటగాడు, వాలంటీర్, స్పాన్సర్లకు మా కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు కృషి చేస్తాం” అన్నారు.
తామా చైర్మన్ మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) మాట్లాడుతూ, “తామా సంస్థ 45 సంవత్సరాలుగా తెలుగు సంస్కృతిని, ఐక్యతను కాపాడుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రీడా కార్యక్రమం ఆ ప్రయాణంలో మరో మైలురాయి” అని అభిప్రాయపడ్డారు.
తామా బోర్డు సభ్యులు సురేష్ యాదగిరి (Suresh Yadagiri) మాట్లాడుతూ.. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. చక్కని క్రీడావేదికతోపాటు, అందరితో అన్ని విషయాలలో సమన్వయం చేసుకుంటూ తామా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతమవడంలో తోడ్పడ్డారన్నారు.
పోటీల అనంతరం విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేశారు. పాల్గొన్న అందరికీ సర్టిఫికేట్లు అందించి ప్రోత్సహించారు. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) ప్రాంగణంలోప్రేక్షకులు కూడా ఉత్సాహంగా మ్యాచ్‌లను వీక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తామా (Telugu Association of Metro Atlanta – TAMA) వాలంటీర్లు, నిర్వాహకులు, స్పాన్సర్లు ముఖ్య పాత్ర పోషించారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన స్పందన తామా క్రీడా కార్యక్రమాలకు ఉన్న ఆదరణను మరోసారి రుజువు చేసింది.
మొత్తానికి ఈ తామా (TAMA) బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (Badminton Tournament) క్రీడాస్ఫూర్తిని, కమ్యూనిటీ ఐక్యతను ప్రతిబింబిస్తూ అట్లాంటా (Atlanta, Georgia) లో ఒక స్ఫూర్తిదాయక క్రీడా వేడుకగా నిలిచిందనడంలో సందేహం లేదు.