Connect with us

Associations

అంగరంగ వైభవంగా తామా@40 వేడుకలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ 40 వసంతాల వేడుకలను ఆల్ఫారెట్టాలోని ఫేజ్ ఈవెంట్స్ ప్రాంగణంలో నవంబర్ 20న సంస్కృతి, కళలు, ఆధునికత మేళవింపుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్ ఎస్ లెండింగ్, సోమిరెడ్డి లా గ్రూప్, నార్త్ ఈస్ట్ మోర్ట్ గేజ్ సమర్పించిన ఈ వేడుకలలో దాదాపు 900 మంది ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.

ప్రముఖ సినీ నటి లయ, టాలీవుడ్ గాయనీగాయకులు అంజనా సౌమ్య, సాగర్, సందీప్ కురపాటి, శృతి నండూరి, వ్యాఖ్యాతలు మధు & లావణ్య గూడూరు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, 23 రకాల వంటకాలతో సహపంక్తి భోజనాలు, డిజిటల్ స్క్రీన్ & సౌండ్ సిస్టం, ర్యాఫుల్ బహుమతులు, పిల్లలకు ప్రత్యేకంగా క్యూరీ లెర్నింగ్ నిర్వహించిన నాలెడ్జ్ బౌల్, లీగల్ సెమినార్, షాపింగ్ స్టాల్ల్స్ ఇలా ఎన్నెన్నో ఎట్రాక్షన్స్.

తామా సాంస్కృతిక కార్యదర్శి శ్రీవల్లి శ్రీధర్ ప్రారంభ ఉపన్యాసం చేయగా, తామా కార్యవర్గం జ్యోతి ప్రజ్వలన గావించారు. అధ్యక్షులు ఇన్నయ్య ఎనుముల అందరినీ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించారు. బోర్డు ఛైర్మన్ కమల్ సాతులూరు నూతన సభ్యులను సభకు పరిచయం చేసారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను బహుకరించారు.

విశిష్ట అతిథి అట్లాంటా కాన్సులేట్ జనరల్ స్వాతి కులకర్ణి, ప్రత్యేక అతిథులు యు ఎస్ ఎ సేనేటర్ గ్రెగ్ దోలెజెల్, హౌస్ రెప్రెసెంటేటివ్స్ టాడ్ జోన్స్, ఏంజలికా కౌశే, డిస్ట్రిక్ట్ కమిషనర్లు సిండీ మైల్స్, టాడ్ లేవెంట్, ఆల్ఫ్రెడ్ జాన్, జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ బాబ్ ఎర్రమిల్లి, దిలీప్ తున్కి, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తదితరులను సత్కరించారు. తామా 40 వసంతాల ప్రత్యేక సంచిక సోవినీర్ మొదటి ప్రతిని ఉపాధ్యక్షులు రవి కల్లి కాన్సులేట్ జనరల్ స్వాతి కులకర్ణి కి అందజేసారు.

స్పాన్సర్లందరికీ మొమెంటో, దుశ్శాలువా మరియూ పుష్పగుచ్ఛముతో ఘనంగా సత్కరించారు. స్వర్గీయ శ్రీనివాస్ రాయపురెడ్డి మెమోరియల్ తామా వాలంటీర్ 2021 అవార్డు మురళి బొడ్డు కు ఇవ్వడం జరిగింది. డాక్టర్ శ్రీహరి మాలెంపాటి తామా ఫ్రీ క్లినిక్ ఏర్పాటు చేయడంలో ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన స్మారకార్థం తామా క్లినిక్ వాలంటీర్ అవార్డు ఈ సంవత్సరం బాల ప్రభాకర్రావు కడియాల కి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో తామా ఉచిత క్లినిక్ వాలంటీర్ డాక్టర్లను సత్కరించడం జరిగింది. తామా కు మరొక మూలస్థంభం తెలుగు భాష. విజయ్ రావెళ్ల తామా, మనబడి ఎలా కలిసి పని చేస్తాయో చెప్పి తామా వారి సేవలను కొనియాడారు.

వాలంటీర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారే తామాకి బలం, బలగం. భరత్ మద్దినేని, అనిల్ యలమంచిలి, వెంకీ గద్దె, వినయ్ మద్దినేని, శివ తాళ్లూరి, రాజేష్ జంపాల, సురేష్ ధూళిపూడి, బాల మద్ద, భరత్ అవిర్నేని, గిరిధర్ తంగి, లక్ష్మి నారాయణ గద్దె, హర్ష ఎర్నేని, హితేష్ వడ్లమూడి, మహేష్ పవార్, రామ్ మద్ది, అనిల్ కొల్లి, విజయ్ బాబు కొత్త, గిరి సూర్యదేవర, వెంకట్ సోము, హరి అద్దంకి, శరత్ అనంత్ కందిమళ్ల, రమేష్ వెన్నెలకంటి, సుబ్బారావు మద్దాళి, వినయ్ గోపిశెట్టి, శివ పూల, రమేష్ పాలెం, సంజీవ్ ఎక్కలూరి, వెంకట్ బొల్లిముంత, అరుణ్ కావటి, సుధీర్ సన్నారెడ్డి, రమణ నీలం లకు తామా వారు కృతజ్ఞతాభినందనాలు తెలియజేశారు.

మరిన్ని ఫోటోల కొరకు WWW.NRI2NRI.COM ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected