Connect with us

Associations

మన ఊరిని తలచుకుంటూ ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా ‘తాజా’ నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన మొట్టమొదటి కల్చరల్ ఈవెంట్ ‘సంక్రాంతి సంబరాలు’ ఈ నెల 29న ముఖాముఖీగా నిర్వహిస్తున్నారు. జాక్సన్విల్ లోని స్థానిక బోల్స్ మిడిల్ స్కూల్ దీనికి వేదిక.

ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటదో చెప్పినట్టే, ఈ ఈవెంట్ ప్రోమో చూస్తే సంక్రాంతి సంబరాలు చిన్నప్పుడు మనం ఊరిలో ఎలా జరుపుకుంటామో అంతకు మించి ఉండేలా ప్రణాళిక నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది. జనవరి 29 శనివారం మధ్యాహ్నం 3:30 నుండి మొదలయ్యే ఈ ఈవెంట్లో తెలుగుదనంతో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తుల పోటీలు, పసందైన విందు భోజనం హైలైట్స్ గా నిలవనున్నాయి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected