Connect with us

Financial Assistance

పెనమలూరులో పేద కుటుంబానికి తానా, ఠాగూర్ మల్లినేని ఆర్ధిక సాయం

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, గోసాల గ్రామానికి చెందిన పోతురాజు రమేష్ గారు ఇటీవల మరణించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు. సాయం చేయవలసిందిగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ని సంప్రదించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు చేయూత కోఆర్డినేటర్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో తానా మీడియా సమన్వయకర్త, ఎన్నారై ఠాగూర్ మల్లినేని ఆర్ధికంగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

వెంటనే 50 వేల రూపాయిల చెక్కు చెక్కు రెడీ చేసి పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోడె ప్రసాద్ చేతుల మీదుగా గోసాల గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కస్ట సమయంలో అండగా నిలబడిన తానా వారిని మరియు ఠాగూర్ మల్లినేని ని గ్రామస్తులు అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected