మార్చ్ 11న చికాగోలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ‘టీఏజీసీ’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక రమడ ఇన్ బాంక్వెట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా తెలంగాణ సంఘం సహ సమర్పకులుగా వ్యవహరించగా, చికాగో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్సుల్ రాజేశ్వరి చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఏజీసీ మహిళా ఫోరం చైర్మన్ బింధు గంగోటి, అధ్యక్షులు జ్యోతి చింతలపాణి అందరికి స్వాగతం పలుకగా జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు మొదలయ్యాయి. ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు, శైలజా మురుగు సంగీతం, మమతా శర్మ మరియు గ్రీష్మ వర్గీస్ ల సూచనలు సలహాలు, రబిడా పిల్లల ఆసుపత్రికి విరాళాల సేకరణ, రాఫుల్ బహుమతులు ఈ వేడుకలలో హైలైట్ గా నిలిచాయి. రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ తదితర బహుమతులు అందజేశారు. అలాగే ప్రముఖ నటి అతిలోక సుందరి శ్రీదేవి మృతికి సంతాపం తెలిపారు. చికాగో పరిసర ప్రాంతాలనుంచి విరివిగా హాజరై మహిళామణులు ఈవేడుకలను విజయవంతం చేశారు. చివరిగా ప్రియా రెస్టారంట్ విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.