Connect with us

Events

TACA @ Toronto, Canada: వైభవంగా 2025 సంక్రాంతి సంబరాలు – Ramesh Munukuntla

Published

on

Canada లో తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా Telugu Alliances of Canada ఆధ్వైర్యములో తేది 11 జనవరి 2025 శనివారం రోజున కెనడా దేశం విశాల టోరొంటో (Toronto) లోని బ్రాంప్టన్ (Brampton) చింగువాకూసి సెకండరీ స్కూలు ఆడిటోరియంలో పన్నెండు వందల మందికి పైగా ప్రవాస తెలుగు వాసులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని సంక్రాంతి పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

తాకా (Telugu Alliances of Canada) అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల (Ramesh Munukuntla) గారు ప్రారంబించగా కోశాదికారి శ్రీ మల్లిఖార్జునా చారి (Mallikarjuna Chari) పదిర సభికులను ఆహ్వానించగా, శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శ్రీమతి విశారద పదిర, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి అనిత సజ్జ, శ్రీమతి ప్రశాంతి పిన్నమరాజు మరియు శ్రీమతి అశ్విత అన్నపురెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంబమయ్యాయి.

కెనడా జాతీయ గీతం (Canada National Anthem) ఆలాపనతో సాయంత్రము ఇదు గంటల ముప్పది నిముషములకు ప్రారంబమైన సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు ఐదు గంటల పాటు నిరాఘాటంగా వందకు పైన స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులతో కొనసాగాయి. సంక్రాంతి (Sankranti) పండుగ సాంప్రదాయలతో పిల్లలందరికీ భోగిపళ్లు ఆశీర్వాదం ప్రముఖ పురోహితులు శ్రీ మంజునాథ్ గారు జరిపించగా, తల్లిదండ్రులు, ముత్తైదువలు పండుగ సంస్కృతిని కొనసాగిస్తూ ఆశీర్వదించగా, తాకా సంక్రాంతి సంబరాలలో ప్రతి సంవత్సరం భోగిపళ్లు వేడుక జరిపించడం హాజరైన తెలుగు వారందరు అభినందించారు.

ఈనాటి పండుగ సంబరాలలో కెనడా పార్లమెంటు సభ్యులు (Member of Parliament, Canada) శ్రీ చంద్రకాంత్ ఆర్య (Chandrakanth Arya) గారు ముఖ్య అతిథిగా పాల్గొని కెనడా తూర్పు కాలమానం ప్రకారం తెలుగు తిధులు, నక్షత్రాలతో తయారుచేసిన తాకా 2025 కాలెండరును ఆవిష్కరించారు. తాకా వ్యవహారిక కార్యక్రమములో అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు మాట్లాడుతూ తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంసృతి సాంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేయుటకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొన వలసినదిగా కోరారు.

ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం మాట్లడుతు శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయం తో సంగీతం, మరియు నాట్యంలో డిప్లమా, డిగ్రీ కోర్సులు కెనడాలో బోదనకై తాకా ఒప్పందం కుదుర్చుకొన్నట్లు తెలియచేస్తూ త్వరలోనే తరగతులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ముఖ్య ఫౌండరు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, సభికులనుద్దేసించి ప్రసంగించారు

తదుపరి డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న గెలిచిన పిల్లలకు జ్ఞాపికలను అందచేశారు.
ఈ పండుగ సంబరాలలో తాకా (TACA – Telugu Alliances of Canada) వారు పన్నెండు రకాల వంటకాలతో ఏర్పాటుచేసిన రుచికరమైన తెలుగు భోజనం అందరూ ఆరగించి తాకా కమీటీ సభ్యుల కృషిని కొనియాడారు.

అధక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల (Ramesh Munukuntla) గారు మాట్లాడుతూ తాకా (TACA) ఆశయాలను ముందుకు తీసుకువెల్లటం, తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకేవేదికపైకి తీసుకురావడం ముఖ్యం కాగా, అందు కోసం సహకరిస్తున్న గ్రాండ్ స్పాన్సర్ శ్రీ రాం జిన్నాల గారికి, ప్లాటినం స్పాన్సర్లు హైదరాబాద్ హౌస్ మిస్సిస్సౌగా రెస్టారెంటు, సన్లైట్ ఫుడ్స్, గోల్డు స్పాన్స ర్లు మరియు సిల్వర్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంక్రాంతి (Sankranti) సంబరాలలో అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు శ్రీ రాఘవ్ అల్లం, కోశాదికారి శ్రీ మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి అనిత సజ్జ, డైరక్టర్లు శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, యూత్ డైరక్టర్లు సాయి కళ్యాణ్ వొల్లాల, శ్రీమతి ప్రశాంతి పిన్నమరాజు , శ్రీమతి అశ్విత అన్నపురెడ్డి, శ్రీ రాజా అనుమకొండ, ఎక్స్ అఫిసియో సభ్యురాలు శ్రీమతి కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీలు శ్రీమతి వాణి జయంతి, శ్రీ పవన్ బాసని మరియు ఫౌండరు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, శ్రీ శ్రీనాథ్ కుందూరి గారలు పాల్గొన్నారు.

ఈ మొత్తం వేడుకలకు వ్యాఖ్యాతలుగా శ్రీమతి అనిత సజ్జ, శ్రీమతి ప్రశాంతి పిన్నమరాజు మరియు శ్రీమతి అశ్విత అన్నపురెడ్డి గారలు వ్యవహరించారు. చివరగా బోర్డు ట్రస్టీ శ్రీమతి వాణి జయంతి గారు, సంక్రాంతి పండుగకు సహకరించిన స్పాన్సర్లు, దిజిటల్ స్క్రీన్ టీం, డీజే టీం, డెకోరేషన్ టీం, ప్రంట్ డెస్క్ టీం, ఫుడ్ టీం, ఆడియో వీడియో టీం , వలంటీర్లను సమన్వయ పరచిన శ్రీ గిరిధర్ మోటూరి, మరియు పీల్ డిస్త్రిక్టు స్కూలుబోడు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ వందన సంపర్పణ చేశారు. ఆఖరుగా భారత జాతీయ గీతాలాపనతో 2025 సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ముగిసాయి.

error: NRI2NRI.COM copyright content is protected