Connect with us

Sports

Concord, North Carolina: పెల్లుబికిన యువ క్రీడా ప్రతిభ @ టి7 కిడ్స్‌ టోర్నమెంట్‌ – TANA

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) క్రికెట్‌ పోటీల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తానా టి7 కిడ్స్‌ క్రికెట్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 24వ తేదీన నార్త్‌ కరోలినా (North Carolina) లోని కన్‌కోర్డ్‌ (Concord) లో ఉన్న కెజిఎఫ్‌ గ్రౌండ్‌ (KGF Ground) లో ఈ పోటీలు జరిగాయి.

రెండు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. 9, 10, 11 వయస్సు వారికి, 12, 13, 14 వయస్సు పిల్లలకు విడివిడిగా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజుగా 100 డాలర్లను నిర్ణయించారు. విజేతలకు 200 డాలర్లు, రన్నర్‌కు 150 డాలర్ల క్యాష్‌ ప్రైజ్‌ (Cash Prize) ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ (Cricket Tournament) లో పాల్గొనేందుకు ఎంతోమంది యువ క్రీడాకారులు ఉత్సాహం చూపించారు. వారి క్రీడా ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. వివిధ చోట్ల ఉన్న యువ క్రికెట్‌ క్రీడాకారులంతా తానా (TANA) జెర్సీలతో ఆడుతూ ఉంటే వచ్చినవారు చప్పట్లతో వారిని ఉత్సాహపరచడం విశేషం.

గ్రౌండ్ ని తానా క్రీడల జెండాలతో అలంకరించటం విశేషం. ఛార్లెట్‌ (Charlotte, North Carolina) లో మొదటిసారిగా ఇలాంటి పోటీలను నిర్వహించినందుకు నిర్వాహకులను అందరూ అభినందించారు. ఈ తానా టి7 కిడ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ (Kids Cricket Tournament) లో యువ క్రీడా ప్రతిభ పెల్లుబికింది.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) ఆధ్వర్యంలో తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్‌ కిరణ్‌ కొత్తపల్లి, పట్టాభి కంటమనేని, రమణ అన్నె, వలంటీర్లు వెంకీ అడుసుమిల్లి, చందు బచ్చు, గోపి పాములపాటి, రఘు వీరమాచనేని, శ్రీధర్‌ నాగు బోయిన, సతీష్‌ నాగ భైరవ, సాయి కిలారు, వెంకట క్రిష్ణ తదితరులు ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected